Homeఎంటర్టైన్మెంట్Venu Swamy: బిగ్ బ్రేకింగ్ : వేణు స్వామి కి కోలుకోలేని షాక్ ఇచ్చిన హైకోర్టు..తక్షణమే...

Venu Swamy: బిగ్ బ్రేకింగ్ : వేణు స్వామి కి కోలుకోలేని షాక్ ఇచ్చిన హైకోర్టు..తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ!

Venu Swamy: సోషల్ మీడియా ని ఉపయోగించుకొని సెలెబ్రిటీల జాతకాలపై సంచలన వ్యాఖ్యలు చేసి నిత్యం ట్రెండింగ్ లో ఉండే వ్యక్తి వేణు స్వామి. ఈయన నోటి నుండి మంచి మాటలు రావడం బహుశా మనం ఎక్కడా చూసి కూడా ఉండము. తనకి ఇష్టమైన నాయకుడు జగన్ కి ఒక్కటే ఈయన పాజిటివ్ గా జాతకాలు చెప్తాడు. అలా చెప్పి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల ముందు వెర్రి వాడి గా ఈ ఎన్నికల సమయంలో మిగిలిపోయాడు. ఇక భవిష్యత్తులో ఎవ్వరి జాతకాలు చెప్పను అంటూ తనకి తాను శపథం చేసుకున్న వేణు స్వామి, నాగ చైతన్య, శోభితలు శుభమా అంటూ నిశ్చితార్థం చేసుకుంటే, వాళ్లిద్దరూ విడిపోతారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో పెను దుమారం రేపింది. ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఈయనపై మహిళా కమీషన్ కి ఫిర్యాదు చేసారు.

వారం రోజుల్లో కమీషన్ కి హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. దీనికి వేణు స్వామి అభ్యంతరం వ్యక్తం చేస్తూ, నన్ను విచారించేందుకు, నాపై చర్యలు తీసుకునేందుకు మహిళా కమీషన్ కి ఎలాంటి అధికారం లేదంటూ హై కోర్టు కి వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. దీనిని సుదీర్ఘంగా విచారించిన హై కోర్టు స్టే ఆర్డర్ ని ఎత్తివేసింది. మహిళా కమీషన్ కి వేణు స్వామి పై అన్ని విధాలుగా చర్యలు తీసుకునే అనుమతి ఉందని, ఆయన వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హై కోర్టు కమీషన్ ని ఆదేశించింది. దీంతో వేణు స్వామి కి కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పుడు కచ్చితంగా ఆయన కమీషన్ కి హాజరై ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందే. లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. ఆయన అరెస్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాబోయే రోజుల్లో వేణు స్వామి కి చుక్కలు కనిపిస్తాయి అనేది స్పష్టంగా అర్థం అవుతుంది.

ఇలాంటి వాళ్లకు కఠినమైన శిక్ష విధించాలని, లేకపోతే ఇలాంటి వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకొని కొత్తవాళ్ళు జాతకాల పేరుతో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తారని, భవిష్యత్తులో అలాంటివి జరగకుండా ఉండాలంటే వేణు స్వామి కి కచ్చితంగా శిక్ష పడాలని అంటున్నారు నెటిజెన్స్. వేణు స్వామి గెలకని హీరో, హీరోయిన్ ఎవరూ మిగలలేదు. పవన్ కళ్యాణ్ జీవితం లో ఎమ్మెల్యే కాలేడని, ప్రభాస్ తీసే ప్రతీ సినిమా ఇక అట్టర్ ఫ్లాప్ అవ్వుదని, నాగ చైతన్య – సమంత విడిపోతారని, రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా కి భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురు అవుతాయని, ఇలా ప్రతీ ఒక్కరిపై ఎదో ఒక కామెంట్ చేస్తూనే ఉండేవాడు. ఈయన చెప్పిన వాటిలో సమంత, నాగ చైతన్య విషయం ఒక్కటే నిజమైంది. దానిని అడ్డం పెట్టుకొని ఈయన చేసిన దందా మామూలుది కాదు. ఇప్పుడు మళ్ళీ జాతకాలు అంటూ మీడియా ముందుకు వస్తే ఈయన్ని జనాలు కుమ్మే పరిస్థితులు ఉన్నందున ఈమధ్య ఈయన జాతకాలు చెప్పడం లేదు. కానీ ఇప్పుడు ఈయన మీద చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో కచ్చితంగా మళ్ళీ వింటేజ్ వేణు స్వామి రావొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper