spot_img
Homeఎంటర్టైన్మెంట్Thaman: తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన తమన్ ఎందుకో తెలుసా?

Thaman: తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన తమన్ ఎందుకో తెలుసా?

Thaman: తమన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వచ్చే కొత్త సినిమాలకు ఆల్మోస్ట్ తమనే మ్యూజిక్ అందిస్తున్నారు. మరి కొత్త సినిమాలన్నింటికి తానే మ్యూజిక్ అందిస్తున్నారంటే మరెవరు లేక అనుకుంటున్నారా? అసలు కాదు.. తమన్ అందించే మ్యూజిక్ అలా ఉంటుంది. అయితే రీసెంట్ గా ఈయన పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. నాన్న అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాన్న లేని లోటు ఎవరు తీర్చలేరు. అయితే నాన్నను తల్చుకొని బాధ పడ్డారు తమన్. ఎందుకు ఏంటి అనే విషయాలు మీకోసం..

సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయిపోయాడు తమన్. స్టార్ హీరోలు, పాన్ ఇండియన్ చిత్రాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. అలాంటి తమన్ చిన్నతనంలో ఎన్ని కష్టాలు పడ్డాడో కొందరికి మాత్రమే తెలుసు. గతంలో ఈ విషయం గురించి ఓ ఇంటర్య్వూలో తెలిపింది. ఈ మ్యూజిక్ డైరెక్టర్ బాల్యం గురించి కొన్ని విషయాలు పంచుకుంటూ ఎమోషనల్ అయింది. తమన్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడని.. అప్పటి నుంచీ మ్యూజిక్ నేర్చుకుంటూ కుటుంబ పోషణ చేసేవాడని.. చిన్నప్పటి నుంచే పెద్ద బాధ్యతను తీసుకున్నాడని పేర్కొంది.

తమన్‌కి చిన్నతనం నుంచి కూడా సంగీతం అంటే మహా ఇష్టమని, అది గమనించే కీబోర్డ్ ప్లేయర్‌గా జాయిన్ చేయించామని, తాను కూడా ఈజీగా నేర్చుకున్నాడని, ఆ తరువాత అదే జీవనోపాధిగా మారిందని తమన్ తల్లి సావిత్రమ్మ చెప్పుకొచ్చింది. అయితే తండ్రి లేని కష్టాలు తమన్ ఎన్నో అనుభవించాడని, చిన్న వయసులోనే బాధ్యతలను మోశాడంటూ సావిత్రమ్మ చెబుతూ ఎమోషనల్ అయింది. అలా తమన్ తల్లి తండ్రి గురించి మాట్లాడితే ఇప్పుడు ఏకంగా తమన్ తన తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నాడు.

తమన్ తన తండ్రిని కోల్పోయి 28ఏళ్లు అవుతోందట. దీంతో మిస్ యూ నాన్నా అంటూ ట్వీట్ వేశాడు. మీరు మమ్మల్ని వదిలి వెళ్లిపోయి 28 ఏళ్లు అవుతోంది.. మీరు మా చుట్టూనే ఉన్నారు.. మీరే మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు.. లవ్యూ నాన్నా అంటూ తన తండ్రికి సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు. ఇక ఏఐ జనరేటెడ్ ఫోటోతో ఇలా తన తండ్రిని చూసుకుంటూ ఎమోషనల్ అవుతున్నాడంటూ తమన్ ట్వీట్ కింద నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు

తమన్ ప్రస్తుతం భగవంత్ కేసరి రీ రికార్డింగ్ పనిలో ఉన్నాడు. మహేష్ బాబు గుంటూరు కారం ఫస్ట్ సింగిల్‌ను రెడీ చేశాడు. అంతేకాదు గేమ్ చేంజర్ పాట లీక్ అవ్వడంతో అందులో తమన్ ట్యూన్, లిరిక్స్ మీద దారుణమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక రామ్ బోయపాటి స్కందకు తమన్ ఆర్ఆర్ మీద కూడా కంప్లైంట్లు వచ్చాయన్న విషయం విదితమే. మరి ఈ విషయాలపై అధికారికంగా ఎవరు స్పందించలేదు. చూడాలి వీటిపై ఎవరైనా స్పందిస్తారేమో..

ఏది ఏమైనా తమన్ మ్యూజిక్ కోసం ఎదురుచూసే వారికి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎన్నో సినిమాలు తమన్ మ్యూజిక్ తోనే రాబోతున్నాయి కాబట్టి వారందరికి మరోసారి తమన్ కొత్త మ్యూజిక్ వినే అవకాశం దొరికింది. మీకు కూడా ఇష్టం ఉంటే టెన్షన్ ఎందుకు సినిమాలు రిలీజ్ అయ్యాక చూసేయండి…

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
Oktelugu Epaper