Homeఎంటర్టైన్మెంట్Teja Sajja: వామ్మో గ్రేట్ తేజ సజ్జా .. హనుమాన్ కోసం 75 సినిమాలు...

Teja Sajja: వామ్మో గ్రేట్ తేజ సజ్జా .. హనుమాన్ కోసం 75 సినిమాలు వదులుకున్నాడా?

Teja Sajja: చిన్న సినిమాలుగా వచ్చినా కొన్ని సినిమాలు మాత్రం భారీ హిట్ ను సొంతం చేసుకుంటాయి. మంచి కంటెంట్ ఉంటే ఏ హీరో హీరోయిన్ సినిమాలను అయినా ఆదరిస్తాం అని నిరూపిస్తుంటారు ప్రేక్షకులు. అదే విధంగా హీరో సజ్జ నటించిన హనుమాన్ సినిమాను కూడా ఆదరించారు ప్రేక్షకులు. సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ సినిమా రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే.

తేజ సజ్జా-ప్రశంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకొని అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్ లో నటిస్తున్నన్న రోజులు మరో సినిమాకు ఒకే చేయలేదట హీరో. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఈ సజ్జ. హనుమాన్ సినిమా కోసం 25 సార్లు లుక్ టెస్ట్ చేశారట. ఈ సినిమాలో అన్నీ తాను స్వయంగా చేశానని.. నీళ్లలో సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను అని తెలిపారు సజ్జ.

ఈ సినిమా తీయడానికి రెండున్నర సంవత్సరాలు పట్టిందని.. ఆ సమయంలోనే తను మరే ఇతర ప్రాజెక్ట్ లను కూడా ఒకే చేయలేదు అన్నారు. పూర్తి శ్రద్ద హనుమాన్ సినిమాపైనే పెట్టారట. అయితే అప్పుడు ఆయన వద్దకు 70-75 సినిమాల ఆఫర్లు వచ్చాయట. వాటిలో కనీసం 15 మంచి కథలున్నాయట. అయినా కూడా ఏ సినిమాకు కమిట్ కాలేదు అని చెప్పారు. ఈ సినిమా విజయం ఎంతో సంతోషాన్నిచ్చిందని.. హైదరాబాద్ లో వేసిన ప్రీమియర్లకు వచ్చిన స్పందన చూశాను అని.. ఆ తర్వాత వసూళ్లను పట్టించుకోలేదు అన్నారు. కలెక్షన్ల కంటే ప్రేక్షకాదరణ ముఖ్యం అన్నారు.

జనవరి 12న విడుదలైన హనుమాన్ సినిమా ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకుంది. సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాల జాబితాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టి నెంబర్ 1గా నిలిచి 92 సంవత్సరాల టాలీవుడ్ రికార్డును తిరగరాసింది సినిమా. ఈ సినిమా హిట్ జోష్ లో ఉన్న దర్శకుడు జై హనుమాన్ సినిమాను తెరకెక్కించనున్నారు. దీన్ని అంతర్జాతీయ సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Oktelugu Epaper