Vijay Divorce Sangeetha Background: నిన్నటి నుండి సోషల్ మీడియా లో సంగీత(Sangeetha) అనే పేరు మారు మోగిపోతూ ఉంది. ఒకపక్క విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి సంబరాలకు సంబంధించిన అప్డేట్స్ వైరల్ అవుతుంటే, మధ్యలో ఈ సంగీత ఎవరు అని అనుకోకండి, ఆమె సాధారణమైన వ్యక్తి కాదు, తమిళ స్టార్ హీరోలలో ఒకరైన తలపతి విజయ్(Thalapathy Vijay) సతీమణి . ఈమె చెన్నై లోని చెంగలపట్టు ఫ్యామిలీ కోర్టు లో విడాకులు కావాలంటూ పిటీషన్ దాఖలు చేసింది . దీని పై సోషల్ మీడియా లో నిన్నటి నుండి వస్తున్న ట్రోల్స్ మామూలైవి కావు. సొంత అభిమానులే విజయ్ ని తిడుతున్నారు. హీరో త్రిష తో అక్రమ సంబంధం ఉంది అనే విషయం గత కొన్నేళ్లుగా కోలీవుడ్ మొత్తం కోడై కూసింది. ఇప్పుడు ఆయన సతీమణి కూడా అవే ఆరోపణలు చేయడం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే ఇంతకు ఎవరు ఈ సంగీత ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు చూడబోతున్నాము.
సంగీత శ్రీలంక లో స్థిరపడిన తమిళ అమ్మాయి. ఆమె తండ్రి ఒక గొప్ప పారిశ్రామిక వేత్త. 1996 వ సంవత్సరంలో విడుదలైన విజయ్ ‘పూవే ఉనక్కాగా ‘ అనే చిత్రాన్ని చూసి సంగీత ఆయనకు వీరాభిమాని అయిపోయింది. ఎంతలా అంటే ఆమె విజయ్ ని కలవడం కోసమే లండన్ నుండి చెన్నై కి వచ్చింది. లండన్ యూనివర్సిటీ లో ఆమె చదువుతున్న రోజుల్లో విజయ్ కి ప్రేమ లేఖలు కూడా రాసేది అట. ఈమె పద్దతి ని , తనపై ఉన్న పిచ్చి ప్రేమని నచ్చి విజయ్ ఈమెని తన ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. అప్పుడు ఏర్పడిన వీళ్లిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. 1999 వ సంవత్సరం ఆగస్టు 25 న వీళ్లిద్దరి పెళ్లి హిందూ , క్రైస్తవ సంప్రదాయాల్లో గ్రాండ్ గా జరిగింది.
Also Read: ‘ధురంధర్ 2 ‘మొట్టమొదటి రివ్యూ వచ్చేసింది..ఇలా ఉంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు!
ఈమె ఒక పెద్ద సూపర్ స్టార్ భార్య అయినప్పటికీ కూడా , చాలా సింపుల్ గా ఉండేది. బయట మీడియా కి ఎక్కువ గా కనిపించేది కాదు. అంతే కాదు కోలీవుడ్ విజయ్ తో సరిసమానమైన క్రేజ్ ఉన్నటువంటి అజిత్ భార్య షాలిని , ఈమెకు అత్యంత ఆప్తురాలు. ఇకపోతే సంగీత కి లండన్ లో చాలా వ్యాపారాలు ఉన్నాయి. అంతే కాకుండా ఆమె పేరు మీద 400 కోట్ల రూపాయిల ఆస్తులు లుకూడా ఉన్నాయి. కాబట్టి ఈమె ఒంటరిగా తన కాళ్ళ మీద తానూ నిలబడగలిగే సత్తా ఉన్న అమ్మాయి అన్నమాట. రాబోయే రోజుల్లో ఈ విడాకుల వ్యవహారం లో ఆమె పోరాటం ఎలా ఉంటుందో చూడాలి.