Surekha Vani: ఆంటీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రముఖ నటి ‘సురేఖావాణి’కి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆమె కూతురు సుప్రీత కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే, ‘సురేఖావాణి’ పెళ్లి పై రోజుకో పుకారు వస్తూనే ఉంది. ఆమె రెండో పెళ్ళికి రెడీ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నలభై ఏళ్ల వయసులో కూడా ఎంతో అందంగా కనిపించే ‘సురేఖావాణి’ మళ్లీ పెళ్లి చేసుకోవడం పెద్ద షాకింగ్ విషయం ఏమి కాదు.

ఇంతకీ ‘సురేఖావాణి’ పెళ్లి పై వస్తున్న పుకారులో ఏది నిజం ? ఏది అబద్దం ? అని తేల్చుకోలేక నెటిజన్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క ఇండస్ట్రీలో ఇంకా పెళ్లి కాకుండా మిగిలిపోయిన కొందరు ‘సురేఖావాణి’ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ తెగ ప్రపోజల్ పెడుతున్నారట. ఈ లిస్ట్ లో కొందరు డైరెక్టర్లు కూడా ఉన్నారట.
Also Read: Nagarjuna: నాగార్జున సంచలన నిర్ణయం.. కారణం రొమాన్సే
మొత్తానికి సురేఖా వాణికి ఉన్న డిమాండ్ ను చూస్తుంటే.. త్వరలోనే ఆమె రెండో పెళ్లికి స్క్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉంది. సురేఖా వాణి తన రెండో భర్త గురించి పక్కా క్లారిటీ ఇచ్చింది. తానూ రెండో పెళ్లి చేసుకుంటే గనుక, తనకు కాబోయే వాడు బాగా డబ్బున్న వాడు అయి ఉండాలి అంటూ ఎలాంటి మొహమాటం లేకుండా కుండ బద్దలు కొడుతూ తానూ ఏమి కోరుకుంటుందో స్పష్టంగా తెలియజేసింది.
ఏది ఏమైనా సినిమాల్లో అక్క అమ్మ పాత్రలతో పాటు కొన్ని ఎమోషనల్ పాత్రల్లోనూ అంతే స్థాయిలో నటించి ఆ పాత్రలను రక్తి కట్టించే సురేఖా… ఏజ్ అయిపోయినా ఇంకా పర్ఫెక్ట్ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ.. కొత్త కొత్త లుక్స్ తో సోషల్ మీడియాలో బాగానే పాపులారిటీ సంపాదించింది. కానీ, తెర పై చూసే సురేఖా వాణి వేరు, బయట ఉండే సురేఖా వాణి వేరు.

ఎదిగిన కూతురు ఉన్నా… ఇంకా యంగ్ అండ్ మోడ్రన్ మదర్ లానే తనను తానూ ప్రమోట్ చేసుకుంటూ వస్తోంది. ఒక విధంగా సురేఖా వాణి దెబ్బకు కూతురు సుప్రిత కూడా పోటీ పడలేని పరిస్థితి కనిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే తనెత్తు కూతురు ఉన్నా.. సురేఖా వాణి గ్లామర్ అస్సలు తగ్గలేదని నెటిజన్లు కూడా కామెంట్స్ పెడుతున్నారు. కాగా ప్రస్తుతం సురేఖా వాణి రీసెంట్ గా మొదలైన షూటింగ్ లతో కాస్త బిజీ అయింది.
Also Read:Mahesh- Trivikram: మహేష్ కోసం ముగ్గురు హీరోయిన్లు.. త్రివిక్రమ్ ట్రేడ్ మార్క్ ఇది
Recommended Videos