Nagarjuna: కింగ్ నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ”ది ఘోస్ట్” సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ కి కూడా సిద్ధం చేస్తున్నారు. ఐతే.. ఈ సినిమా తర్వాత ఇక కొత్తగా ట్రై చేయను అంటున్నాడు నాగ్. నిజానికి నాగార్జునకు ప్రయోగాలు అంటే బాగా ఇష్టం. ఒకవిధంగా నాగార్జున కెరీర్ కి బాగా ఉపయోగపడింది కూడా నాగార్జున తీసుకున్న ప్రయాత్మక నిర్ణయాలే.

నాగార్జునను స్టార్ ను చేసిన ‘శివ’ సినిమా కూడా నాగ్ ఒక ప్రయోగంగానే చేశాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల విషయంలో కూడా నాగార్జున కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా, తనకు నచ్చిన విధంగానే చేసుకుంటూ పోయాడు. అవే హిట్ అయి, నాగ్ కి స్టార్ డమ్ ను తెచ్చి పెట్టాయి. అయితే, వయసు పెరిగింది. ప్రయోగాలు చేయాలని ఉన్నా.. ఈ మధ్య కాలంలో కొన్ని ప్రయోగాలు చేసినా.. ఏవీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.
Also Read: Chammak Chandra- Satya: చమ్మక్ చంద్రతో సత్యకు ఆ‘ఫైర్’ ఉందా? సంచలన నిజాలు లీక్
పైగా నాగ్ కి చాలా బ్యాడ్ నేమ్ తెచ్చి పెట్టాయి. అందుకే, ఇక నుంచి రకరకాల సినిమాలు ట్రై చేయడంలో ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్, రొమాంటిక్ సినిమాలకు ఇక దూరంగా ఉండాలని నాగ్ భావిస్తున్నారట. నిజానికి కెరీర్ మధ్యలో ఎన్నో ఫ్లాపులు వచ్చినా.. నాగార్జున ఎప్పుడు తన ప్రయత్నాలను ప్రయోగాలను ఆపడానికి ఇష్టపడలేదు.
కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. నా ఐడియాలు నేటి ప్రేక్షకులకు కనెక్ట్ కావడం లేదు. అందుకే నేనే మారాలని నిర్ణయించుకున్నాను అంటూ నాగ్ తన మనసు మార్చుకున్నట్లు అర్థమవుతుంది. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ నాగార్జునకు తాజాగా ఒక కథ చెప్పాడు. ఆ కథ డిఫెరెంట్ గా సాగుతుంది. కథ వినగానే నాగార్జున చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.

పైగా స్క్రిప్ట్ అద్భుతం అంటున్నాడు గానీ, సినిమా మాత్రం చేయను అని చెబుతున్నాడట. కారణం అదొక రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్. ఇక తాను ఇప్పటికీ రొమాంటిక్ సినిమాలు చేస్తూ వుంటే ఈ జనరేషన్ కుర్రాళ్ళు చూడరని నాగార్జున చెబుతున్నాడట. మొత్తానికి నాగార్జునలో చాలా మార్పు వచ్చింది. రొమాన్స్ అంటేనే భయపడుతున్నాడు.
Also Read:Mahesh- Trivikram: మహేష్ కోసం ముగ్గురు హీరోయిన్లు.. త్రివిక్రమ్ ట్రేడ్ మార్క్ ఇది
[…] […]