Surekha Vani: కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. జీవితాన్ని ఎంజాయ్ చేయడమే. ఇదే పాలసీ ఫాలో అవుతున్నారు సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత . పేరెంట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. అందుకు సురేఖా వాణి బెస్ట్ ఎగ్జామ్ఫుల్. ఈ తల్లీ కూతుళ్లు స్నేహితుల వలె మెలుగుతారు. సురేఖా వాణి టాలీవుడ్ లో చాలా కాలంగా ఉన్నారు. ఈమె కెరీర్ యాంకర్ గా మొదలైంది. మా టీవీలో పని చేసే రోజుల్లో సురేష్ తేజ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి చేసుకుంది. వీరికి సుప్రీత ఒక అమ్మాయి.
సురేష్ తేజ సుదీర్ఘ కాలం అనారోగ్యంతో పాల్పడ్డాడు. 2019లో ఆయన కన్నుమూశారు. భర్త మరణంతో సురేఖా నటనకు దూరమైంది. సినిమాలు చేయలేదు. దానికి తోడు 2020 లో కరోనా వ్యాపించింది. లాక్ డౌన్ తో చిత్ర పరిశ్రమ కుదేలైంది. చిత్ర నిర్మాణం ఆగిపోయింది. అలా అనుకోకుండా ఓ రెండేళ్లకు పైగా గ్యాప్ వచ్చింది. దాంతో చిత్ర పరిశ్రమ సురేఖా వాణిని మర్చిపోయింది.
ఆ మధ్య ఓ సినిమా వేడుకలో సురేఖా వాణి తన వేదన వెళ్లగక్కింది. సినిమాల్లో నటించడం లేదు ఎందుకని చాలా మంది అడుగుతున్నారు. అవకాశాలు ఇస్తే ఎందుకు చేయను. దర్శక నిర్మాతలు నన్ను పట్టించుకోవడం లేదని సురేఖా వాణి అసహనానికి గురయ్యారు. సురేఖా వాణి అడపాదడపా చిత్రాల్లో కనిపిస్తున్నారు. కాగా కూతురు సుప్రీతను హీరోయిన్ చేయాలనేది సురేఖా వాణి కోరిక.
ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. కూతురిని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పాప్యులర్ చేసింది. వీరిద్దరూ కలిసి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తారు. తాజాగా ఇద్దరూ కలిసి నైట్ పార్టీ లో చిల్ అయ్యారు. బ్లాక్ ట్రెండీ వేర్ ధరించి గ్లామరస్ లుక్ లో షాక్ ఇచ్చారు. సురేఖా వాణి కూతురు సుప్రీత ఈ ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Surekha and supreeta latest pictures are going viral on social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com