ఎలాంటి వివాదాల్లో లేని రజినీకాంత్(Superstar Rajinikanth) కి హై కోర్టు ఊరట కల్పించడం ఏంటి?, అసలు అక్కడి వరకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని టైటిల్ ని చూసిన వెంటనే మీ అందరికీ అనుమానాలు వచ్చి ఉండొచ్చు. ఈ అంశంపై పూర్తి వివరాల్లోకి వెళ్తే రజినీకాంత్ కి చెన్నై లోని కోడంబాకం హై రోడ్డులో ఒక భవనం ఉంది. హైటెక్ వాసులతో ఎంతో అందంగా నిర్మించిన ఈ భవనాన్ని రజినీకాంత్ ఓ హోటల్ సంస్థకు అద్దెకు ఇచ్చాడు. అయితే 2007 వ సంవత్సరం నుడి 2012 వ సంవత్సరం వరకు 56 లక్షల 84 వేల రూపాయిల వరకు సర్వీస్ ట్యాక్స్ కట్టాలని ఆ శాఖ సూపర్ స్టార్ రజినీకాంత్ కి నోటీసులు అందించింది. దీనిని రజనీకాంత్ వ్యతిరేకిస్తూ నందనం లో ఉన్నటువంటి సర్వీస్ ట్యాక్స్ అప్పీలు ట్రిబ్యునల్ లో 2016 వ సంవత్సరం లో కోర్టు లో అప్పీల్ కి వెళ్లారు.
ఈ అప్పీల్ పై ధర్మాసనం సభ్యుడు ఏం. అజిత్ కుమార్, న్యాయశాఖ సభ్యుడు అజయంతో కూడైన ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. 1994 వ సంవత్సరం ఆర్ధిక చట్టం ప్రకారం , హోటల్ నిర్వహణ కోసం అద్దెకు ఇచ్చిన భవనాల నుండి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయడాన్ని మినహాయించినట్టు రజినీకాంత్ తరుపున న్యావాడి రవిచంద్రన్ ధర్మాసనానికి వివరించాడు. ఈ వాదనకు సర్వీస్ ట్యాక్స్ బృందానికి చెందిన న్యాయవాది ఓఎం రీనా అభ్యంతరం వ్యక్తం చేయగా , హోటల్ లోని డైనింగ్ , మీషఙ, క్లబ్ , బార్ వంటివి ఉన్నాయని, వీటి ద్వారా రజినీకాంత్ లాభాలు అందుకుంటున్నాడు కాబట్టి, సర్వీస్ ట్యాక్స్ కచ్చితంగా కట్టాల్సిందే అంటూ ఓఎం రీనా వాదించింది. ఇరువురి తరుపున న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు ట్రిబ్యునల్ హోటళ్లలో బస చేసే అతిధులకు అన్ని సౌకర్యాలు చూసుకోవాల్సిన బాధ్యత , వాటిని నిర్వహిస్తున్న యజమాన్లదే కాబట్టి , వాళ్ళు సర్వీస్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే లేదంటూ ఆ ఉత్తర్వులను రద్దు చేసింది.
దీంతో రజినీకాంత్ కే భారీ లెవెల్ లో ఊరట కలిగింది. వాస్తవానికి రజినీకాంత్ కి ఉన్న స్థాయికి ఆయన 56 లక్షల రూపాయిల సర్వీస్ టాక్స్ ని కట్టడం ఒక సెకండ్ పని. కానీ న్యాయం గెలవాలనే ఉద్దేశ్యంతోనే ఆయన కోర్టు లో ఇన్ని రోజులు పోరాటం చేసాడు అంటూ ఆయన కమిట్మెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో రజినీకాంత్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్ 2’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు.