Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10' నుండి దక్షి అవుట్.. 2 వారాలకు...

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ నుండి దక్షి అవుట్.. 2 వారాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే!

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన వారిలో ఒకరు దక్షి. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె , ఈ షో లోకి కంటెస్టెంట్ గా వచ్చి ఆడియన్స్ కి బాగా చేరువ అవ్వాలని అనుకుంది. రింగు రింగుల జుట్టుతో చూసేందుకు చాలా అందంగా అనిపిస్తోంది , గేమ్ పర్ఫెక్ట్ గా ఆడితే వేరే లెవెల్ కి వెళ్తుందని అంతా […]

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన వారిలో ఒకరు దక్షి. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె , ఈ షో లోకి కంటెస్టెంట్ గా వచ్చి ఆడియన్స్ కి బాగా చేరువ అవ్వాలని అనుకుంది. రింగు రింగుల జుట్టుతో చూసేందుకు చాలా అందంగా అనిపిస్తోంది , గేమ్ పర్ఫెక్ట్ గా ఆడితే వేరే లెవెల్ కి వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి నిన్నటి వరకు తనదైన మార్కు చూపించుకోలేకపోయింది. టాస్కులు సరిగా ఆడలేకపోయింది , అవసరమైన సమయం లో తన వాయిస్ ని కూడా రైజ్ చేయలేకపోయింది. ముఖ్యంగా టాప్ 1 కంటెస్టెంట్ గా కొనసాగుతున్న రోహిత్ ని నామినేట్ చేస్తూ ఈమె చెప్పిన కారణాలు ఏవైతే ఉన్నాయో , వాటిని చూసిన తర్వాత ఆడియన్స్ కి నవ్వాలో , కోప్పడాలో అర్థం కాలేదు.

చెత్త కారణాలు చెప్పి రోహిత్ ని నామినేట్ చేయడమే కాకుండా, చాలా యాటిట్యూడ్ చూపించింది. ఇలా అనేక కారణాల వల్ల ఈ వారం ఆమెని ఆడియన్స్ ఇంటికి పంపేశారు. ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ ని ప్లాన్ చేసిన బిగ్ బాస్, ముందుగా శనివారం ఎపిసోడ్ లో దక్షి ని ఎలిమినేట్ చేసినట్టు సమాచారం. సెలబ్రిటీ క్యాటగిరీ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది కాబట్టి , రెండు వారాలు హౌస్ లో ఉన్నందుకు గానూ ఆమెకు 3 లక్షల రూపాయిల పారితోషికం ఇచ్చారట. అయితే బిగ్ బాస్ టీం ఈమెని అనవసరంగా తీసుకొచ్చారని , ఈమెకు బదులుగా అపూర్వ ని ఎలిమినేట్ చేయకుండా ఉంచుంటే ఈరోజు ఆమె అద్భుతంగా గేమ్స్ ఆడి తన గ్రాఫ్ ని పెంచుకొని ఉండేదని అంటున్నారు నెటిజెన్స్.

ఇకపోతే ఆదివారం ఎపిసోడ్ లో షాలిని ని ఎలిమినేట్ చేశారట. ఈ వారం ప్రారంభంలోనే బిగ్ బాస్ ఒక భారీ ప్రకటన చేసాడు. ఒక కంటెస్టెంట్ ని ఆడియన్స్ ఓట్లతో ఎలిమినేట్ చేస్తామని , మరో కంటెస్టెంట్ ని సడన్ ఎలిమినేట్ చేస్తామని చెప్పుకొచ్చారు. సడన్ ఎలిమినేషన్ కచ్చితంగా హౌస్ మేట్స్ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి , కచ్చితంగా షాలిని ని ఎలిమినేట్ చేస్తారని అందరూ ముందుగానే ఊహించారు. అందరి ఊహలకు తగ్గట్టుగన్ ఆమె ఎలిమినేట్ అయ్యింది. దీంతో రోహిత్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక రోహిత్ గేమ్ మీద ఫోకస్ పెడతాడని , అతనికి తిరుగు ఉండదని అంటున్నారు. మరి అది జరుగుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper