Sudigali Sudheer New Heroine : ప్రస్తుతం సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న హాట్ బ్యూటీ దివ్య భారతి. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీ వీ ప్రకాష్ కుమార్ హీరో గా నటించిన ‘బ్యాచిలర్’ అనే సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీ లోకి పరిచయం అయ్యింది.తమిళం లో ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ ఆడినప్పటికీ హీరోయిన్ దివ్య భారతి మాత్రం కుర్రాళ్ళ దృష్టిలో బాగా పడింది.
దానికి తోడు ఈమె సోషల్ మీడియా లో తనకి సంబంధించిన హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారులని పిచ్చెక్కిపోయేలా చేస్తుంది. టెంప్ట్ అయ్యే ఫోటోలను అప్లోడ్ చేస్తూ అంతకు మించి టెంప్ట్ చేసే క్యాప్షన్స్ కూడా పెడుతుంది. రీసెంట్ గా ఈమె అప్లోడ్ చేసిన ఫోటోలకు ‘నా పై పంచదార చల్లి నన్ను మిఠాయి అని పిలవండి’ అంటూ పోస్ట్ చేసింది.
ఆమె పెట్టిన ఈ పోస్టు కి నిమిషాల వ్యవధి లోనే లక్షల కొద్దీ లైక్స్ మరియు కామెంట్స్ వచ్చాయి.అలా తరుచూ సోషల్ మీడియా లో ఫోటో షూట్స్ తో హల్చల్ చేసిన ఈ అమ్మాయికి క్రేజ్ అయితే బాగానే ఉంది కానీ, అవకాశాలే ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రస్తుతం ఈమె తమిళం లో ‘మధిల్ మెల్ కాథల్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ చిత్రం తో పాటుగా ఆమె తెలుగు లో సుడిగాలి సుధీర్ హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం లో కూడా హీరోయిన్ గా చేసే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకి ‘గోట్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సుధీర్ రీసెంట్ గానే సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలిపాడు. ఈ చిత్రం ఒకవేళ హిట్ అయితే ఈ హాట్ బ్యూటీ కచ్చితంగా శ్రీలీల కి పోటీ ని ఇస్తుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు, మరి ఆమె భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.