Director Mallidi Vasishta: కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన చిత్రం ‘భింబిసారా’. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ నుండి సంక్షోభం నుండి బయటపడేసింది. అసలు ఒక స్థిరమైన మార్కెట్ లేని కళ్యాణ్ రామ్ కి ఈ చిత్రం ఏకంగా 40 కోట్ల రూపాయిల షేర్ మార్కెట్ ని తెచ్చిపెట్టింది. ఫాంటసీ కి ఎమోషన్ ని జోడించి డైరెక్టర్ వసిష్ఠ తెరకెక్కించిన తీరు ప్రశంసనీయం.
ఇది ఆయనకీ మొదటి సినిమా అంటే నమ్మశక్యం గా అనిపించదు. అంత గొప్పగా ఆయన చిత్రీకరించాడు. ఇక ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది అనే విషయం మూవీ క్లైమాక్స్ లోనే తెలుపుతాడు వసిష్ఠ.అంతే కాకుండా కళ్యాణ్ రామ్ కూడా సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని పలు ఇంటర్వ్యూస్ మరియు సక్సెస్ మీట్స్ లో ఖరారు చేసాడు.
ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కార్యక్రమాలు జారుకుంటుంది. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ చిత్రం నుండి డైరెక్టర్ వసిష్ఠ తప్పుకున్నాడట. అందుకు కారణం వసిష్ఠ తో కళ్యాణ్ రామ్ కి మధ్య ఏర్పడిన కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ అని కొంతమంది రూమర్స్ వ్యాప్తి చేసారు.
అయితే కళ్యాణ్ రామ్ సన్నిహిత వర్గాలు ఈ రూమర్స్ పై స్పందిస్తూ , భింబిసారా చిత్రం గ్రాండ్ హిట్ అయ్యేసరికి వసిష్ఠ కి అవకాశాల వెల్లువ కురుస్తుందని, అందుక్కారణం చేత ఆయన ఈ సినిమాని హ్యాండిల్ చెయ్యలేకపోతున్నాని చెప్పడం తో కళ్యాణ్ రామ్ కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకొని , వేరే చిత్రాలకు షిఫ్ట్ అయ్యేందుకు అనుమంతిని ఇచ్చాడని తెలుస్తుంది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ మరో కొత్త దర్శకుడి కోసం వెతకడం మొదలు పెట్టాడట, దీని పై మూవీ టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.