Homeఎంటర్టైన్మెంట్Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు.. అంతటి బాధ అనుభవిస్తున్నాడా..

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు.. అంతటి బాధ అనుభవిస్తున్నాడా..

Sudigali Sudheer: బుల్లితెర.. వెండితెర.. ఈ రెండిట్లోనూ సమాంతరంగా ప్రయాణం చేస్తున్నాడు సుడిగాలి సుధీర్.. ఇతడికి కోట్లాదిమంది అభిమానులు ఉంటారు. ఎందుకంటే ఇతడు చేసే షో లు చాలా బాగుంటాయి. పోవే పోరా.. సర్కార్.. సరిగమప.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక జబర్దస్త్ లో సుధీర్ ఎన్నో రకాల స్కిట్స్ వేశాడు. సుధీర్ లో స్పాంటేనిటి చాలా బాగుంటుంది.. ఎవరు ఎలా అన్నా సరే సానుకూలంగా తీసుకుంటాడు. అతని మదిలో నెగిటివ్ థాట్స్ ఉండవు. […]

Sudigali Sudheer: బుల్లితెర.. వెండితెర.. ఈ రెండిట్లోనూ సమాంతరంగా ప్రయాణం చేస్తున్నాడు సుడిగాలి సుధీర్.. ఇతడికి కోట్లాదిమంది అభిమానులు ఉంటారు. ఎందుకంటే ఇతడు చేసే షో లు చాలా బాగుంటాయి. పోవే పోరా.. సర్కార్.. సరిగమప.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక జబర్దస్త్ లో సుధీర్ ఎన్నో రకాల స్కిట్స్ వేశాడు. సుధీర్ లో స్పాంటేనిటి చాలా బాగుంటుంది.. ఎవరు ఎలా అన్నా సరే సానుకూలంగా తీసుకుంటాడు. అతని మదిలో నెగిటివ్ థాట్స్ ఉండవు. అందువల్లే అతనికి ఈ స్థాయిలో అభిమానులు ఉన్నారు.

ఒక సాధారణ మెజీషియన్ గా కెరియర్ మొదలుపెట్టిన ఆయన.. రామోజీ ఫిలిం సిటీ లో పనిచేసేవారు. ఆ తర్వాత చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఏకంగా బుల్లితెరను ఏలే స్థాయికి ఎదిగారు. వెండి తెరలోనూ మెరుస్తున్నారు. సోలో హీరోగా సినిమాలలో నటిస్తున్నారు. సుధీర్ కు కెరియర్ పరంగా పెద్దగా ఇబ్బంది లేదు. పైగా ఆయన ఇప్పుడు ఒక రేంజ్ లో ఉన్నారు. తన కాల్ షీట్ల కోసం నిర్మాతలు ఎదురుచూసే విధంగా తన స్థాయిని పెంచుకున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ సుధీర్ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది.. ఆయన పరిస్థితి ఏంటి..ఎవరినైనా ప్రేమించారా.. ఎందుకు ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నారు.. రష్మీ తో లవ్ ట్రాక్ నిజమేనా.. ఒకవేళ అదే నిజమైతే ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేదు.. తనను ఎందుకు ఫ్రెండ్ అని సంబోధిస్తున్నారు… దీనిపై సుధీర్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల సుధీర్ తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆ సమయంలో కొంత మంది అభిమానులు ఆయనను కలిశారు. ఈ నేపథ్యంలో ప్రేమ.. పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సుధీర్ తన స్కూల్ డేస్ లోనే ఒక అమ్మాయిని ప్రేమించారు. దాదాపు 14 సంవత్సరాల పాటు ఆమెను తన కలల యువరాణిగా ఊహించుకున్నారు. కానీ ఆమె మాత్రం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో సుధీర్ చాలా వరకు ఇబ్బంది పడ్డాడు. మానసిక క్షోభను అనుభవించాడు.

ఆ మధ్య తన జన్మదిన వేడుకల సందర్భంగా అభిమానులతో సుధీర్ మాట్లాడారు. ఈ సమయంలో తన వైవాహిక జీవితం గురించి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే పెళ్లి తీసుకుంటానని సుధీర్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ సంవత్సరంలోనే వివాహం జరుగుతుందని ఆయన ప్రకటించారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రష్మితో అన్ని అయిపోయాయి.. అలాంటప్పుడు సుధీర్ ను ఎవరు పెళ్లి చేసుకుంటారని అప్పట్లో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.. కాకపోతే వారిద్దరి మధ్య ఏమీ లేదు.. ఎందుకంటే వారిద్దరూ కేవలం టీవీ షోలలో భాగంగా ప్రేమికుల మాదిరిగా నటించారు. వారి స్కిట్స్ కూడా సూపర్ గా ఆకట్టుకున్నాయి. యూట్యూబ్ లో వారిద్దరి వీడియోలు ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటాయి. మిలియన్లలో వీక్షణలు సొంతం చేసుకున్నాయి.. వారికంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సృష్టించాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper