Homeఆధ్యాత్మికంToday 13 July 2026 Horoscope: ఈ రాశుల వారికి మహాశివుడి ఆశీస్సులు.. ఈరోజు అనుకున్న...

Today 13 July 2026 Horoscope: ఈ రాశుల వారికి మహాశివుడి ఆశీస్సులు.. ఈరోజు అనుకున్న కోరికలను నెరవేర్చుకుంటారు..

Today 13 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు మహాశివుడు ఆశీస్సులు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు ఏ పని మొదలుపెట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. గతంలో మొదలుపెట్టిన పనులు పూర్తి కావడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకున్న కోరికల్లో కొన్ని నెరవేరుతాయి. దీంతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగతంగా సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. అయితే ఉద్యోగులు తమ కార్యకలాపాలను పూర్తి చేయడానికి అధికారుల మద్దతు ఉంటుంది. దీంతో విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇలాంటి సమయంలోనే నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే తోటి వారి సహకారంతో ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు ఉన్నతాధికారుల సహాయంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఆగిపోయిన పనులన్నింటినీ పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు ఉండలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. విదేశాలకు వెళ్లేవారికి శుభవార్తలు అందుతాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు గణనీయమైన లాభాలు పొందుతారు. గతంలో మొదలు పెట్టిన పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరిస్థితిలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరి వల్ల వీరి వ్యాపార అభివృద్ధి గణనీయంగా పెరుగుతుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం కాదు. ఉద్యోగులకు కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. అయితే తోటి వారి సహకారం ఉంటుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ఖర్చులను ఎదుర్కొంటారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. దీంతో ప్రశాంతంగా ఉండగలుగుతారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి పెద్దలను సంప్రదిస్తారు. విద్యార్థుల కెరీర్ పై తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. వ్యాపారానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. పూర్వీకుల ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు ఉంటాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అయితే డబ్బు వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ముఖ్యమైన ఒప్పందాలను చేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు వృధా ఖర్చుల నుంచి బయటపడాలి. విద్యార్థులు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉండే అవకాశం ఉంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. డబ్బు పొదుపు గురించి ఆలోచిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెడతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular