Venkatesh Movie Controversy: వెంకటేష్ హీరో గా తెరకెక్కిన చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. కెరియర్ మొదట్లో ఆయన మాస్ సినిమాలు చేసినప్పటికి ఒకానొక టైమ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తూ ప్రేక్షకులందరిని అలరించాడు. ముఖ్యంగా శోభన్ బాబు తర్వాత అంతటి ఇమేజ్ ను సంపాదించుకున్న తెలుగు హీరో కూడా తనే కావడం విశేషం…వెంకటేష్ వైవిధ్య భరితమైన పాత్రలను పోషించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయితే ఆయన చేసిన చంటి సినిమా విషయంలో అప్పట్లో చాలా వరకు నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి…ఇక సినిమా స్టార్ట్ చేసే సమయంలో ఈ మూవీ ని వెంకటేష్ తో చేస్తున్నాము అని అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. తమిళంలో ‘చిన్న తంబి’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. అయితే ఒరిజినల్ వెర్షన్ ను పి వాసు డైరెక్షన్ చేశాడు.
తెలుగులో కూడా అతనితోనే డైరెక్షన్ చేయిద్దామని రామానాయుడు అడిగితే వెంకటేష్ హీరోగా చేస్తే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడదని చెప్పారట. కారణం ఏంటంటే అప్పటికే వెంకటేష్ మాస్ హీరోగా అవతరించాడు. ఈ సినిమాలో హీరో పెద్దగా మైండ్ మెచ్యూరిటి లేని క్యారెక్టర్ లో నటించాల్సి ఉంటుంది.
అది వెంకటేష్ చేస్తే అంత పెద్దగా ఎఫెక్టివ్ గా ఉండదని దానికంటే ఇమేజ్ లేని హీరోతో చేస్తే బాగుంటుందని చెప్పారట. ఆ విషయానికి కన్విన్స్ కానీ రామానాయుడు రవిరాజా పినిశెట్టిని తీసుకొచ్చి చంటి పేరుతో ఆ సినిమాను రీమేక్ చేయించాడు. మొత్తానికైతే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక వెంకటేష్ కెరీర్లో ఉన్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లలో చంటి సినిమా కూడా ఒకటిగా నిలవడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా ఏ సినిమా ఎవరికి బాగుంటుంది. ఎవరు ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోతారనేది చెప్పడం చాలా కష్టం…స్క్రీన్ మీద ఒకసారి కనిపిస్తే ప్రేక్షకులు ఆటోమేటిగ్గా వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏ క్యారెక్టర్ ని ఎవరు చేసిన కూడా దాన్ని సక్సెస్ ఫుల్ గా నిలుపవచ్చనే ఉద్దేశ్యంతోనే వెంకటేష్ ‘చంటి’ సినిమాతో ప్రూవ్ చేశాడు…
