Sri Reddy: శ్రీ రెడ్డి… చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని చెప్పాలి. తనదైన విమర్శలు చేస్తూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ నటి. కొద్ది రోజుల్లోనే మీడియా లో సెంసేషన్ గా మరి ఇప్పుడు కొంచెం సైలెంట్ గా ఉంటుంది శ్రీ రెడ్డి. ఒకప్పుడు యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు సినిమాలకు కొంత దూరంగా ఉంటున్నారు ఈమె. ఇటీవల రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన క్లైమాక్స్ చిత్రంలో నటించారు. సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో పోస్ట్ లు పెడుతూ ఉంటుంది శ్రీ రెడ్డి. చిన్నాపెద్దా తేడా లేకుండా అందర్నీ రఫ్ఫాడిస్తుంది శ్రీరెడ్డి.
ఇటీవల తన అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది శ్రీ రెడ్డి. త్వరలోనే తన నుంచి సర్ప్రైజ్ ఉండబోతుందని ట్వీట్ చేసింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోసారి ఫాలోవర్స్‌తో ముచ్చటిస్తూ పెళ్లి గురించి ఓపెన్ అయింది శ్రీ రెడ్డి. అసలు మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అంటూ ఒకరు ఆమెను ప్రశ్నించారు. దీనికి పాజిటివ్ గానే స్పందించింది శ్రీ రెడ్డి. తను కూడా అందర్లాంటి అమ్మాయినే అని, పెళ్లి చేసుకోవాలని ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే ఈ రోజుల్లో రిలేషన్ షిప్ అనేది నమ్మకం లేకుండా అయిపోయిందని… లాంగ్ రిలేషన్ షిప్లో ఎవరూ ఉండటం లేదని తెలిపింది. తనను బాగా అర్థం చేసుకుని లాంగ్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేసేవాడు దొరికినపుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని అంటుంది శ్రీ రెడ్డి. ప్రస్తుతం ఈమె సేసిన వ్యక్యాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.