Natyam: ప్రస్తుతం ఉన్న కాలంలో చిన్న సినిమా నుండి పెద్ద సినిమా వరకు పిఆర్ వ్యవస్థకు మంచి డిమాండ్ ఉంది. ఒక సినిమాని జనాలకి వివిధ మార్గాల్లో చేరువ చేయడానికి హైర్ చేసుకునే వ్యక్తిని పీఆర్వో అంటారు.వారు అడిగినంత ఇచ్చి సైలెంట్ గ ఉంటే ఓకే. లేదంటే ఎంతో ప్యాషన్‌తో తెరకెక్కించిన ఆ సినిమాపై బ్యాడ్ రివ్యూస్ ల వర్షం కురుస్తుంది. ఇలా ఒకరిద్దరు బడా పీఆర్‌ఓలు చేస్తున్నారని టాక్. ఇటువంటి సంఘటనే నాట్యం సినిమా దర్శకుడికి ఎదురయ్యింది నాట్యం మూవీ తో దర్శకుడిగా పరిచయం అయ్యారు రేవంత్ కోరుకొండ.ఈ చిత్రం ఎంతో మంది ప్రశసంలు అందుకుంది. కానీ కొన్ని వెబ్‌సైట్స్ మాత్రం సినిమాలో మేటర్ లేదంటూ రివ్యూలు రాశాయి. డైరెక్టర్‌కు అసలు విజనే లేదంటూ దుమ్మెత్తిపోశారు. అసలు ఏం జరుగుతుందా అని క్రాస్ చెక్ చేసుకుంటే ఆప్పుడు అసలు విషయం తెలిసిందట.

నాట్యం సినిమాకు వంశీ-శేఖర్‌లు పీఆర్ఓగా పనిచేశారు ప్రమోషన్స్ పేరు చెప్పి భారీగానే అందుకున్నారు అయితే సినిమా గురించి ఎక్కగా న్యూస్ రాలేదు ఇదేంటని అడిగితే ప్రెస్ మీట్స్ ఉండవ్, తాము చెప్పినట్లు వెబ్‌సైట్స్ అన్నీ రాస్తాయి అని వార్నింగ్ ఇచ్చారట. మేకర్స్ తమను ఎదురు ప్రశ్నించడంతో వంశీ-శేఖర్ సినిమా రిలీజ్ రోజున తమ పవర్ ఉపయోగించి బ్యాడ్ రివ్యూస్ ఇప్పించారు అని చెప్పుకొచ్చారు రేవంత్. తన నాలుగు సంవత్సరాల కష్టాన్ని తమ స్వార్థం కోసం చేశారని దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని నాట్యం సినిమా డైరెక్టర్ రేవంత్ కోరుకొండ న్యాయ పోరాటానికి దిగారు. తన సినిమాపై దుష్ప్రచారం చేసిన వంశీ శేఖర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తెలుగు మూవీ ఆర్టిస్ట్ యూనియన్, డైరెక్టర్స్ యూనియన్‌కు కంప్లైంట్ ఇస్తూ పత్రాలను అందించారు. చూడాలి మరి యూనియన్స్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో…