Sreemukhi: స్టార్ యాంకర్ శ్రీముఖి స్కిన్ షో అంతకంతకూ ఎక్కువ అవుతుంది. అందాలు మొహమాటం లేకుండా చూపించేస్తుంది అమ్మడు. పొట్టిబట్టల్లో కిరాక్ ఫోజులతో కేక పుట్టిస్తుంది. స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా అందాల విందుకు తెరలేపుతుంది. ఓ తెలుగు యాంకర్ ఈ రేంజ్ లో చూపించడమేందని జనాలు నోరెళ్ళబెడుతున్నారు. తాజాగా క్రాప్ టాప్ లెహంగా ధరించి హొయలు పోయింది. బ్రా లేకుండా క్లీవేజ్ చూపిస్తూ రెచ్చగొట్టింది. శ్రీముఖి హాట్ ఫోటో షూట్ కాకరేపుతుండగా, పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.
ఇటీవల శ్రీముఖి బర్త్ డే సెలబ్రేషన్స్ కి థాయిలాండ్ వెళ్లారు. వారం రోజులకు పైగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్ చేశారు. శ్రీముఖి ఎప్పటికప్పుడు తన వెకేషన్ ఫోటోలు ఫ్యాన్స్ కి షేర్ చేశారు. ఇక యాంకర్ గా శ్రీముఖి టాప్ గేర్లో దూసుకుపోతుంది. అన్ని ఛానల్స్ లో సందడి శ్రీముఖిదే. దాదాపు అరడజను షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. అనసూయ యాంకరింగ్ మానేశారు. సుమ జోరు తగ్గించారు. దీంతో నెంబర్ వన్ పొజిషన్ శ్రీముఖి కైవసం చేసుకుంది.
మిగతా యంగ్ యాంకర్స్ కళ్ళముందే శ్రీముఖి స్టార్ గా ఎదిగారు. ఆమెకు జనాల్లో ఉన్న క్రేజ్ రీత్యా సినిమా ఆఫర్స్ సైతం వస్తున్నాయి. హీరోయిన్ గా చేయమంటూ పలువురు మేకర్స్ సంప్రదిస్తున్నారట. అయితే శ్రీముఖి ఆచితూచి సినిమాలు ఎంచుకుంటుంది. గతంలో శ్రీముఖి క్రేజీ అంకుల్, ఇట్స్ టైం టు పార్టీ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. అవి శ్రీముఖికి ఏమాత్రం ఫేమ్ తేలేకపోయాయి. చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని, మంచి ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుందట.
చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ లో శ్రీముఖి కీలక రోల్ చేశారనే ప్రచారం జరుగుతుంది. చిరంజీవి-శ్రీముఖి మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. ఖుషి మూవీలోని ఓ ఐకానిక్ సీన్ స్పూఫ్ చేసారని అంటున్నారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇక థర్టీ ప్లస్ లో అడుగుపెట్టిన శ్రీముఖి పెళ్లి వార్తలు తరచుగా తెరపైకి వస్తున్నాయి. ఈ పుకార్లను శ్రీముఖి ఖండిస్తున్నారు. దానికి కొంత సమయం ఉందంటున్నారు.