Sobhita Dhulipala Latest Post: నాగ చైతన్యతో(Akkineni Naga Chaitanya) సమంత(Samantha Ruth Prabhu) విడిపోయి చాలా కాలం అయ్యింది. ఇద్దరు వేర్వేరు జీవితాలను సంతోషంగా లీడ్ చేస్తున్నారు. నాగచైతన్య గత ఏడాది ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళని(Sobhita Dhulipala) వివాహం చేసుకున్నాడు. ఇక సమంత అయితే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో ప్రేమాయణం నడుపుతుంది. ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారనే విషయం అందరికీ తెలుసు. ఈ ఏడాది లోనే వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. వీళ్లంతా సంతోషం గానే ఉన్నారు కానీ వీళ్ళ అభిమానులు మాత్రం పాత గణపకాలను గుర్తు చేసుకుంటూ ఈ సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ముఖ్యంగా పాపం శోభిత ధూళిపాళ్ల అయితే ప్రతీ రోజు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో నెగటివిటీ ని ఎదురుకుంటూనే ఉంటుంది. ఆమె కామెంట్స్ ని చూస్తుందో లేదో తెలియదు కానీ, చూస్తే మాత్రం చాలా ఫీల్క్ అవుతుంది అనుకోవడం లో ఎలాంటి సందేహం లేదు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అభిమానులకు చేదువార్త..డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన!
ఒకప్పుడు పాపం ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఏ చిన్న పోస్టుని అప్లోడ్ చేసిన సమంత అభిమానులు కామెంట్ సెక్షన్ లో ఎటాక్ చేసేవారు. ఇష్టమొచ్చిన భూతులను ఉపయోగిస్తూ శోభిత క్యారక్టర్ పై అత్యంత నీచమైన కామెంట్స్ చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం అంతా పాజిటివ్ గా మారిపోయింది. శోభిత కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయాలంటే ఆమె అభిమానులకు చాలా ఇబందిగా ఉండేది. ఎందుకంటే అంతటి నీచమైన బూతులు ఉండేవి సమంత అభిమానుల నుండి. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అయ్యింది. శోభిత పై పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, సమంత పై నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఒక అభిమాని అయితే సమంత ఒక జోకర్, దీనిని అంగీకరించేవాళ్ళు లైక్ బటన్ నొక్కండి అంటూ కామెంట్ చేశాడు. మరికొంత మంది అయితే సమంత వేస్ట్, నువ్వు ఏంజిల్ అంటూ కామెంట్స్ చేశారు.
ఇలా ఒక్కటా రెండా, ఎన్నో వందల కామెంట్స్ ఉన్నాయి. ఆ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ని ఈ క్రింద అందిస్తున్నాము,మీరు కూడా ఆ కామెంట్ సెక్షన్ లో ఓపెన్ చేసి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇకపోతే పెళ్ళికి ముందు శోభిత బాలీవుడ్ లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ గా ఉండేది,కానీ పెళ్లి తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ సంఖ్య బాగా తగ్గించేసింది. భవిష్యత్తులో కచ్చితంగా నటిస్తాను అని చెప్పింది కానీ, కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే పోషిస్తానని చెప్పింది. ఇంతకు ముందు లాగా ఈసారి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం కష్టమే అని అర్థం అవుతుంది. ఒకప్పుడు శోభిత ఇలాంటి సన్నివేశాల్లో ఎలా రేచిపోయి నటించేడా చూస్తే నోరెళ్లబెడుతారు. ఇక శోభిత అక్కినేని కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత మూవీ కెరీర్ పరంగా అక్కినేని ఫ్యామిలీ కి మంచి రోజులు మొదలయ్యాయి. అందులో భాగంగానే కుబేర,తండేల్ వంటి హిట్స్ వచ్చాయి.
View this post on Instagram