Kota Srinivasa Rao : పరిపూర్ణమైన నటనకు ఒక రూపం ఉంటే, ఆ రూపం పేరు కోట శ్రీనివాస రావు(Kota Srinivasa Rao). కామెడీ అయినా, విలనిజం అయినా, సెంటిమెంట్ అయినా ఈ మహానటుడిని మ్యాచ్ చేసే నటుడు నేటి తరం లో ఇండియా లోనే లేడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మహానటుడు ఎస్వీ రంగారావు చనిపోయిన తర్వాత, ఆయన స్థానంలో కోట శ్రీనివాస రావు ని చూసుకునే వారు సినీ అభిమానులు. అంతటి గొప్ప నటుడు, ఈమధ్య కాలం లో అనారోగ్యం తో సినిమాలకు కాస్త దూరమయ్యాడు. కానీ కనీసం మనిషి మనతో పాటే జీవిస్తున్నాడు కదా, అది చాలు అని చాలామంది తృప్తి పడేవారు. కానీ నిన్న తెల్లవారుజామున ఆయన హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో తన నివాసంలో తుది శ్వాస విడిచిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది.
Also Read : ప్యారడైజ్ లో కిల్ ఫేమ్ రాఘవ్ జ్యూయల్ చేసే పాత్ర ఏంటో తెలుసా..? నాని కి తనకి సంబంధం ఏంటంటే..?
సినీ పరిశ్రమ మొత్తం కోట శ్రీనివాస రావు గారి ఇంటికి వెళ్లి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఇదంతా పక్కన పెడితే కోట శ్రీనివాస రావు బ్రతికి ఉన్న రోజుల్లో తెలుగు ఆర్టిస్టుల కోసం చాలా పోరాడేవాడు. డైరెక్టర్స్ తెలుగు లో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు లేరు అన్నట్టుగా,ఇతర బాషల నుండి కనీసం ఎక్స్ ప్రెషన్స్ కూడా ఇవ్వడం చేత కానీ ఆరిస్టులను దింపుతున్నారు అని ఆయన ఎన్నోసార్లు తన ఆవేదన వ్యక్తం చేశాడు. పక్క రాష్ట్రాల నుండి దిగుమతి కాబడిన కొంతమంది ఆర్టిస్టులకు, వాళ్ళ ముఖం మీదనే, నువ్వు ఆర్టిస్టుగా వేస్ట్, అభినయం గుండు సున్నా అని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ అంశం పై ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ(Krishna Vamsi) తో ఒకసారి కోట శ్రీనివాస రావు కి చిన్నపాటి వాగ్వాదం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కూడా వీళ్ళ మధ్య వేడిని చల్లార్చలేకపోయాడట.
Also Read : కోట శ్రీనివాస రావు అందరికి నచ్చే వ్యక్తి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్
పూర్తి వివరాల్లోకి వెళ్తే కృష్ణ వంశీ కి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్(Prakashraj) అత్యంత సన్నిహితుడు. ఆయన తన ప్రతీ సినిమాలో కూడా కృష్ణవంశీ కి ప్రత్యేకమైన క్యారెక్టర్స్ రాస్తూండేవాడు. అలా ఆయన రాసిన క్యారెక్టర్స్ లో ప్రకాష్ రాజ్ జీవించి ప్రేక్షకులు పూనకాలు వచ్చి ఊగిపోయేలా చేసిన చిత్రం ‘ఖడ్గం’ . ఈ చిత్రం లో అద్భుతమైన నటన కనబర్చినందుకు గానూ,ప్రకాష్ రాజ్ కి ఉత్తమ సహాయ నటుడు క్యాటగిరీలో అవార్డు వచ్చింది. ఆ ఫంక్షన్ లో కృష్ణవంశీ మాట్లాడుతూ తెలుగు లో ఆర్టిస్టుల కొరత ఉందని,అందుకే పక్క రాష్ట్రం నుండి తెచ్చుకుంటున్నామని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి కోట శ్రీనివాస రావు కి కోపం నషాళానికి అంటుకుంది, వెంటనే కృష్ణవంశీ వద్దకు వెళ్ళాడు. ఆరోజు కృష్ణ వంశీ తో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. అలా నోటికి వచ్చినట్టు ఎలా మాట్లాడుతావు, తెలుగు వాళ్లకు అవకాశం ఇచ్చి చూడు, ఎంత గొప్పగా నటిస్తారో అర్థం అవ్వుధి అని గొడవకు దిగాడట. ఇద్దరి మధ్య చాలాసేపటి వరకు వాగ్వాదం జరిగింది. ఎన్టీఆర్ కూడా కంట్రోల్ చేయలేకపోయాడట.