Prakash Raj Comments On Kota Srinivasa Rao: లెజండరీ నటుడు కోట శ్రీనివాస రావు(Kota Srinivasa Rao) నిన్న తెల్లవారు జామున ఫిలిం నగర్ లోని తన నివాసం లో తుదిశ్వాస విడిచిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘ప్రాణం ఖరీదు’ చిత్రం తో మొదలైన కోట శ్రీనివాస రావు నట ప్రస్థానం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం తో ముగిసింది. ఈ సినిమా ఈ నెల 24 వ తేదీన విడుదల కాబోతుంది. సుమారుగా 750 కి పైగా సినిమాల్లో విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా,కమెడియన్ గా, కామెడీ విలన్ గా ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి తెలుగు సినిమా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. కామెడీ,విలనిజం లో మాత్రమే కాదు, సెంటిమెంట్ సన్నివేశాల్లో కూడా కోట శ్రీనివాస రావు తన నటనతో కన్నీళ్లు పెట్టించగలడు. ఎన్నో అద్భుతమైన తండ్రి పాత్రలు అందుకు ఉదాహరణ.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అభిమానులకు చేదువార్త..డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన!
ఇది ఇలా ఉండగా నిన్న కోట శ్రీనివాస రావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించిన సినీ సెలబ్రిటీలలో ఒకరు ప్రకాష్ రాజ్(Prakash Raj). నిన్న ఆయన కోట శ్రీనివాస రావు గురించి మాట్లాడుతూ ‘తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గర్వించ దగ్గ నటులలో ఒకరు కోట శ్రీనివాస రావు గారు. సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే ముందు నేను కోట గారి నటన ని బాగా పరిశీలించేవాడిని. ఆయన నటన నుండి ఎంతో నేర్చుకున్నాను. గడిచిన మూడు దశాబ్దాలలో ఆయనతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కలిసి పని చేసే అదృష్టం నాకు దక్కింది. కోట చాలా విశిష్టమైన వ్యక్తి. ముక్కిసూతి స్వభావం ఆయనకు అలంకారం లాంటిది. అందుకే ఆయన అందరికి నచ్చడు. అందరికీ నచ్చాలని ఆయన ప్రయత్నం కూడా చెయ్యలేదు. అలాంటి అద్భుతమైన నటుడ్ని మళ్ళీ చూడలేము’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజ్.
అయితే కోట శ్రీనివాస రావు గతం లో ప్రకాష్ రాజ్ పై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రకాష్ రాజ్ అప్పట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి కోసం మంచు విష్ణు తో పోటీ కి దిగాడు. ఆ సమయం లో ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు ఏ రేంజ్ లో ఉండేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెయిన్ ఎన్నికలలో కూడా ఈ రేంజ్ ఫైటింగ్ ని జనాలు చూసి ఉండరు. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ వ్యక్తి అని, అతనికి మా చైర్మన్ అయ్యే అర్హత లేదని , దయచేసి తెలుగువాళ్ళని ప్రోత్సహించండి అంటూ కోట శ్రీనివాస రావు అప్పట్లో ఒక స్టేట్మెంట్ విడుదల చేశాడు. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు అత్యంత నీచమైన కామెంట్స్ చేశారు. నిన్న ప్రకాష్ రాజ్ ని కోట శ్రీనివాసరావు ఇంటి వద్ద చూసినప్పుడు అందరికి ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఒక్కసారిగా ఫ్లాష్ అయ్యింది.