
Shraddhadas : మొన్న సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ బికినీ ట్రీట్ మర్చిపోకముందే.. ఆమెను శ్రద్ధదాస్ తల దన్నింది. స్విమ్మింగ్ పూల్ లో ఈత దుస్తుల్లో తడిసిన తన అందాలను పరి చేసింది. కొంటె చూపుతో రసహృదయులను చూపు తిప్పుకోకుండా చేసింది. మాంచి ఎత్తు, దానికి తగ్గట్టు రంగు, శరీర సౌష్టవం ఉండటంతో అభిమానులు చూపు తిప్పుకోలేకపోతున్నారు. శ్రద్ధా ఏమిటి మా పై నీ అందాల దాడి అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు.
అప్పుడెప్పుడో ఆర్య 2 సినిమా ద్వారా టాలీవుడ్లోకి శ్రద్ధాదాస్ రంగ ప్రవేశం చేసింది. మొదట్లో కొన్ని సినిమాలు బాగానే పడినప్పటికీ తర్వాత ఎందుకనో ఆమె కెరియర్ ఊహించినంత వేగంగా ముందుకు సాగలేదు. దీంతో ఇతర పరిశ్రమల్లోకి వెళ్ళింది. అక్కడ కూడా అడపాదడపా అవకాశాలు వచ్చాయి. దీంతో శ్రద్ధాదాస్ లాభం లేదు అనుకొని తిరిగి మళ్ళీ టాలీవుడ్ లోకి వచ్చింది. అయితే ఆమె వచ్చినంత వేగంగా అవకాశాలు మాత్రం లభించలేదు. దీంతో గత్యంతరం లేక చిన్నచిన్న వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అంతేకాదు ఢీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. అందాల ఆరబోతలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. మొన్నటికి మొన్న శేఖర్ మాస్టర్ తో రెచ్చిపోయి డ్యాన్సులు వేసింది.. మోడ్రన్ కాస్ట్యూమ్ తో అభిమానుల మతులు పోగొట్టింది.
ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ, మల్లెమాల వారి ప్రత్యేక కార్యక్రమాలు కూడా శ్రద్ధదాస్ మెరుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో కూడా శ్రద్ధదాస్ యమా యాక్టివ్ గా ఉంటున్నది. బీచ్ లో, మోడ్రన్ గెస్ట్ హౌస్ ల్లో ఫోటోషూట్ లో పాల్గొంటున్నది. హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నది. దీంతో కుర్ర కారు మతులు పోతున్నాయి. రెచ్చిపోయే దుస్తుల్లో కనిపిస్తున్న శ్రద్ధదాస్ ను చూసి కుర్రాళ్ళ గుండెల్లో కుంపట్లు రగులుతున్నాయి.
ఇక తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో శ్రద్ధదాస్ స్విమ్మింగ్ పూల్ లో తడిచిన తన అందాలను పరవడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.” ఇంత హాట్ నెసా? ఇన్ని రోజులు ఎక్కడ దాచావు? నువ్వు ఇలాంటి ఫోటోలు పెడితే మేము ఏం కావాలి? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే పెళ్లి చేసుకోవడానికి మేము రెడీ? నువ్వు రెడీ నా అంటూ విదంగా ప్రపోజల్ చేస్తున్నారు. మొత్తానికి శ్రద్ధదాస్ స్విమ్మింగ్ పూల్ ఫోటోలు ప్రస్తుతానికి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
View this post on Instagram