Bigg Boss 10 Telugu: నేడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లో ఒకరు రామ కృష్ణ. ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న రామకృష్ణ , కచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లోకి రావాలని బలంగా కోరుకున్నారు ఆడియన్స్. 3 వ వారం వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ అయినటువంటి అపూర్వ , మితిలేష్ లతో పాటు రామకృష్ణ కి కూడా సమానమైన అవకాశం ఇచ్చారు. అయితే టాస్క్ ఓడిపోవడం వల్ల హౌస్ మేట్ అవ్వలేకపోయాడు. ఇప్పుడు సోషల్ మీడియా లో ఆడియన్స్ రామకృష్ణ ఎంట్రీ ని బలంగా కోరుకోవడం తో ఆయనకు బిగ్ బాస్ టీం మరో అవకాశం ఇచ్చింది. అంతే కాదు వైల్డ్ కార్డ్స్ గా హౌస్ లోకి వచ్చిన ప్రతీ ఒక్కరికి నాగార్జున ఒక స్పెషల్ పవర్ ఇచ్చాడట. ముఖ్యంగా రామకృష్ణ కి ఇచ్చిన పవర్ చాలా పవర్ ఫుల్ అట. దాని గురించి తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఓటింగ్ లో రోహిత్ కి దరిదాపుల్లో కూడా మరో కంటెస్టెంట్ లేరు. త్రిగున్ రోహిత్ గ్రాఫ్ ని అందుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ , దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నాడు. కానీ రెండవ స్థానం లో కొనసాగుతున్నాడు. అయితే రామ కృష్ణ కి ‘అగ్ని పరీక్ష 2’ లో ఉన్నప్పుడు రోహిత్ తో సమానమైన ఓటింగ్ నమోదు అయ్యేది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి , నాలుగైదు టాస్కులు బలంగా ఆడితే మాత్రం రామకృష్ణ కి తిరుగు ఉండదనే చెప్పాలి. రోహిత్ కి ఉన్న ఏకైక గండం ఒక్క రామకృష్ణ మాత్రమే. అయితే రామకృష్ణ రోహిత్ లాగా బాగా మాట్లాడలేడు , కానీ టాస్కుల్లో మాత్రం దుమ్ము దులిపేస్తూ ఉంటాడు. ఫిజికల్ టాస్కుల్లో అయితే ఇతనితో తలపడడం చాలా కష్టమే.
ఇదంతా పక్కన పెడితే ‘అగ్ని పరీక్ష 2’ సమయం లో రామకృష్ణ కి షాలిని తో పెద్ద గొడవలు ఉన్నాయి. ముఖ్యంగా షాలిని రామ కృష్ణ పై అరవడం, అందుకు కౌంటర్ గా రామకృష్ణ కూడా షాలిని మీదకు దూసుకెళ్తూ అరవడం వంటివి పెద్ద సెన్సేషన్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇప్పుడు షాలిని రోహిత్ తో ప్రేమలో మునిగి తేలుతోంది. ఆమె కారణంగా కచ్చితంగా రామకృష్ణ , రోహిత్ మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే కనుక జరిగితే రామకృష్ణ పై సానుభూతి జనాల్లో మామూలు రేంజ్ లో పెరగదు అనే చెప్పాలి. ఏ వైపు చూసిన రామ కృష్ణ టైటిల్ గెలిచేందుకు అవకాశాలు కళ్ళముందు కనిపిస్తున్నాయి. మరి ఆ అవకాశాలను ఆయన ఎంత వరకు ఉపయోగించుకుంటాడో రాబోయే రోజుల్లో చూడాలి.