Homeఎంటర్టైన్మెంట్Shekhar Kammula Balakrishna Movie: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ.. ఇదేమి కాంబినేషన్ సామీ..

Shekhar Kammula Balakrishna Movie: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ.. ఇదేమి కాంబినేషన్ సామీ..

Shekhar Kammula Balakrishna Movie: కొన్ని కాంబినేషన్స్ విన్నప్పుడు ఆశ్చర్యపోయి నోరెళ్లబెడుతుంటాము, అసలు ఈ కాంబినేషన్ లో సినిమా ఎలా వర్కౌట్ అవుతుంది?, ఊహించుకోవడానికే కష్టం గా ఉంది అని అనేక సందర్భాల్లో మనకి అనిపించి ఉండొచ్చు. అలాంటి విచిత్రమైన కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. కెరీర్ మొత్తం సున్నితమైన సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న శేఖర్ కమ్ముల(Shekar Kammula), మాస్ కి […]

Shekhar Kammula Balakrishna Movie: కొన్ని కాంబినేషన్స్ విన్నప్పుడు ఆశ్చర్యపోయి నోరెళ్లబెడుతుంటాము, అసలు ఈ కాంబినేషన్ లో సినిమా ఎలా వర్కౌట్ అవుతుంది?, ఊహించుకోవడానికే కష్టం గా ఉంది అని అనేక సందర్భాల్లో మనకి అనిపించి ఉండొచ్చు. అలాంటి విచిత్రమైన కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. కెరీర్ మొత్తం సున్నితమైన సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న శేఖర్ కమ్ముల(Shekar Kammula), మాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తో తన తదుపరి చిత్రం చేయడానికి ఫిక్స్ అయ్యినట్టు ఇండస్ట్రీ లో ప్రధానంగా వినిపిస్తున్న వార్త. ‘లవ్ స్టోరీ’ చిత్రం తర్వాత భారీ గ్యాప్ తీసుకొని ‘కుబేర’ తో గత ఏడాది మన ముందుకొచ్చాడు శేఖర్ కమ్ముల. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

మొదటి నుండి సున్నితమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ వచ్చిన శేఖర్ కమ్ముల, తొలిసారి తన కంఫర్ట్ జోన్ ని పక్కన పెట్టి , యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ‘కుబేర’ ని తెరకెక్కించడం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. ఇక పై ఆయన అలాంటి తరహా సినిమాలు చెయ్యాలని ఫిక్స్ అవ్వడం వల్లే బాలయ్య తో సినిమా చేయాలనీ అనుకుంటున్నాడా?, లేదంటే బాలయ్య ని తన స్టైల్ లో చూపించి ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. రీసెంట్ గానే శేఖర్ కమ్ముల బాలయ్య ని కలిసి ఒక పవర్ ఫుల్ స్టోరీ లైన్ ని వినిపించాడట. అది ఆయనకు తెగ నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది లోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే బాలయ్య కొరటాల శివ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు జరిగింది. అదే విధంగా వివేక్ ఆత్రేయ తో కూడా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా జరగనుంది. ఈ రెండు సినిమాల కంటే ముందు ఆయన గోపీచంద్ మలినేని తో చేస్తున్న చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇలా వరుసగా క్రేజీ డైరెక్టర్స్ తో సినిమాలు ఒప్పుకుంటూ , నేటి తరం స్టార్ హీరోలతో పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నాడు బాలయ్య. మరి వీటిల్లో ఎన్ని సక్సెస్ అవ్వబోతున్నాయో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper