Kubera OTT release : రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్ గా నిలిచి కాస్త థియేటర్స్ యాజమాన్యాలకు ఊపిరి పోసిన చిత్రం ఏదైనా ఉందా అంటే అది శేఖర్ కమ్ముల(Sekhar కమ్ముల) దర్శకత్వం వహించిన ‘కుబేర’ చిత్రం మాత్రమే. ఈ సినిమా తర్వాత ‘కన్నప్ప’ , ‘తమ్ముడు’ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. ఆ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పటికీ ‘కుబేర’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ స్థాయి షేర్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. గత వీకెండ్ లో దాదాపుగా కోటి 50 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 67 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. మరో రెండు వారాల థియేట్రికల్ రన్ కచ్చితంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి.
అయితే థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్నప్పటికీ కూడా ఈ సినిమాని ఓటీటీ లోకి విడుదల చెయ్యాలని అనుకుంటున్నారట. అమెజాన్ ప్రైమ్(Amazon prime video ) సంస్థ తో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం జులై 20 న ఈ చిత్రాన్ని కచ్చితంగా విడుదల చెయ్యాలి. ముందుకు కదిలే అవకాశం లేకపోవడం తో మేకర్స్ కూడా అందుకు అంగీకరించారు. ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నిడివి మూడు గంటలకు పైనే ఉండడంతో చాలా మంది ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లే ఆలోచన విరమించుకున్నారు. వీళ్లంతా ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి ఆడియన్స్ కి ఈ వార్త ఇప్పుడు పండుగ లాంటిది అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా థియేటర్స్ లో కంటే ఓటీటీ లోనే పెద్ద సంచలనాత్మక విజయాన్ని నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి సినిమాలను ఓటీటీ ఆడియన్స్ బాగా అలరిస్తూ ఉంటాయి.
లక్కీ భాస్కర్ సినిమా గుర్తుందా..?, గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా చాలా మామూలుగా విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే థియేటర్స్ లో పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. మంచి వసూళ్లతో దుమ్ము లేపేసింది .. కానీ నెట్ ఫ్లిక్స్ లో ఇంకా పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 వారాల పాటు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయ్యింది. కుబేర కూడా ఆ లేవే లోనే ఓటీటీ లో రెస్పాన్స్ తెచుకుంటుందని బలమైన నమ్మకం తో ఉన్నారు. మరి ఆ నమ్మకాన్ని ఈ సినిమా ఎంత వరకు నిలబెడుతుంది అనేది కూడలి.