Homeఎంటర్టైన్మెంట్Senior Telugu Directors Struggling: టాలెంట్ ఉన్నప్పటికి సత్తా చాటలేకపోతున్న సీనియర్ డైరెక్టర్స్...

Senior Telugu Directors Struggling: టాలెంట్ ఉన్నప్పటికి సత్తా చాటలేకపోతున్న సీనియర్ డైరెక్టర్స్…

Senior Telugu Directors Struggling: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. కెరియర్ మొదట్లో తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం స్టార్ హీరోలను లీడ్ చేయడంలో మాత్రం తడబడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న స్టార్ హీరోలతో సినిమాలను చేసే స్థాయిని కూడా వాళ్ళు అందుకోలేకపోతున్నారు. కారణమేదైనా కూడా ఒకప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్లుగా పేరుపొందిన వాళ్ళందరు ఇప్పుడు ఎందుకని వెనుకబడి పోతున్నారు కారణం ఏంటి అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు అంటే పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, హరీష్ శంకర్ లాంటి దర్శకులు కావడం విశేషం…అయితే వీళ్ళందరు తమ కెరీర్ ని సక్సెస్ ఫుల్ సినిమాలతో స్టార్ట్ చేశారు. కానీ ఈ మధ్యకాలంలో వీళ్ళు చేస్తున్న సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించడం లేదు.

ఈ జనరేషన్లో ఉన్న ప్రేక్షకులను మెప్పించడంలో వీళ్ళు చాలా వరకు వెనుకబడిపోయారు. పూరి జగన్నాథ్ లైగర్ సినిమా నుంచి పూర్తిగా డీలా పడిపోయాడనే చెప్పాలి. అంతకుముందు చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఓకే అనిపించుకుంది. ఇక లైగర్ తర్వాత చేసిన డబుల్ ఇస్మార్ట్ సినిమా డిజాస్టర్ గా మారింది. ఇప్పుడు విజయ్ సేతుపతి తో చేస్తున్న స్లమ్ డాగ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన భావిస్తున్నాడు.

మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… శ్రీను వైట్ల సైతం గతంలో స్టార్ హీరోలందరితో సినిమాలను చేశాడు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించడం లేదు. గత సంవత్సరం గోపీచంద్ తో చేసిన ‘విశ్వం’ సినిమా సైతం డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది.

ఇక ఇప్పుడు ఆయన శర్వానంద్ తో చేయబోతున్న సినిమా ఏ మేరకు సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక హరీష్ శంకర్ సైతం గత రెండు సినిమాలతో భారీగా డీలాపడ్డాడు. గతంలో మంచి సక్సెస్ లను సాధించిన ఆయన రవితేజతో చేసిన మిస్టర్ బచ్చన్, పవన్ కళ్యాణ్ తో చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమాలతో డిజాస్టర్ లను అందుకున్నాడు. ఇక ఇప్పటికైనా వీళ్ళందరు వాళ్ళ స్ట్రాటజీని మార్చి సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తే పర్లేదు కానీ లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Today 22 July 2026 Horoscope

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper