Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: అల్లు అర్జున్ వల్లే ఆ సినిమా ప్లాప్ అయింది... మొత్తానికైతే ఒప్పుకున్నాడుగా...

Allu Arjun: అల్లు అర్జున్ వల్లే ఆ సినిమా ప్లాప్ అయింది… మొత్తానికైతే ఒప్పుకున్నాడుగా…

Allu Arjun: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒకరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణమేంటంటే వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాయి. మొత్తానికైతే తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న వారిలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉన్నాడు. పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ శాసించే స్థాయికి వెళ్లిపోయాడు. అట్లీతో చేస్తున్న ‘రాకా’ సినిమాతో పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీ ని […]

Allu Arjun: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒకరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణమేంటంటే వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాయి. మొత్తానికైతే తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న వారిలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉన్నాడు. పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ శాసించే స్థాయికి వెళ్లిపోయాడు. అట్లీతో చేస్తున్న ‘రాకా’ సినిమాతో పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీ ని సైతం షేక్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ గతంలో చేసిన ఒక సినిమా ఫ్లాప్ అయింది. ఆ ఫ్లాప్ వెనక తను కూడా ఒక కారణమని అల్లు అర్జున్ పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘వరుడు’ సినిమా కావడం విశేషం…

గుణశేఖర్ ఒక్కడు సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన తర్వాత అల్లు అర్జున్ తనతో ఒక్క సినిమా అయిన సరే చేయాలని అనుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే గుణశేఖర్ వేరే వాళ్ళతో అనుకున్న వరుడు సినిమా కాన్సెప్ట్ ని అల్లు అర్జున్ పట్టుబట్టి మరి మనమే ఈ సినిమా చేద్దామని చెప్పారట. దాంతో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వరుడు సినిమా అయితే వచ్చింది.

ఈ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడమే కాకుండా అల్లుఅర్జున్ మార్కెట్ చాలా వరకు డ్యామేజ్ చేసిందని చాలామంది అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ ఈ సినిమాని చేయడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయిందని మరి కొంతమంది అంటున్నారు. ఎందుకంటే గుణశేఖర్ ఈ సినిమాని ఒక కొత్త హీరోతో చేయాలని అనుకున్నాడు. కొత్త హీరో అయితే ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు.

కాబట్టి వాళ్లకి ఈ సినిమా బాగా సెట్ అయ్యేదని అల్లు అర్జున్ కావడం వల్ల ఈ సినిమాలో అనుకోకుండా చాలా మార్పులు చేయాల్సి వచ్చిందని పలు సందర్భాల్లో తెలియజేశారు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు అంటే అతనికి కెరియర్ స్టార్టింగ్ లో వచ్చిన హిట్లు ఫ్లాప్ లే దానికి కారణమని మరి కొంత మంది చెబుతున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper