నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బొయపాటి కాంబినేషన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో బాలయ్య డ్యూయల్ చేస్తుండగా.. ఒక పాత్రలో అఘోరాగా కన్పించబోతున్నాడట. ఇక వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘సింహ’.. ‘లెజండ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. తాజాగా మరోసారి వీరికాంబినేషన్లో మూవీ వస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: త్రివిక్రమ్ తో సినిమాపై మహేష్ ఆసక్తికర ట్వీట్
బాలకృష్ణ ప్రస్తుతం బొయపాటి సినిమాకు మాత్రమే కమిట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్ దర్శకులంతా ఆయనతో సినిమా చేసేందుకు బాలకృష్ణ ఇంటి ముందు క్యూ కడుతున్నారు. అయితే బాలకృష్ణ త్వరలోనే బి.గోపాల్ తో ఓ మూవీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో వీరద్దరి కాంబినేషన్లో రౌడీ ఇన్స్పెక్టర్.. సమరసింహారెడ్డి.. నరసింహనాయుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్లో మూవీ రాబోతుంది.
మరో సీనియర్ దర్శకుడు వీ.వీ.వినాయక్ కూడా బాలకృష్ణతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వీ.వీ.వినాయక్ ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాతో బీజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవితో వినాయక్ ‘లూసీఫర్’ రీమేక్ చేయనున్నాడు. అయితే దీనికి చాలా సమయం పట్టేలా ఉండటంతో ఈలోపు బాలయ్యతో ఓ సినిమా చేయాలని వినాయక్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Also Read: సుశాంత్ కేసులో ట్విస్ట్: రియా ఊపిరి పీల్చుకో..
కాగా ప్రస్తుతం సీనియర్ దర్శకుల పరిస్థితి ఇండస్ట్రీలో దారుణంగా తయారైంది. కుర్ర హీరోలంతా కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. సీనియర్ హీరోలు సైతం ఫామ్ ఉన్న దర్శకులకే ప్రాధాన్యం ఇస్తుండటంతో సీనియర్ దర్శకులకు హీరోలు దొరకడం లేదు. ఇప్పటికే పలువురు సీనియర్ హీరోలు ఇతర సినిమాలో బీజీగా ఉన్నారు.
బాలయ్య కేవలం బొయపాటితో సినిమాకు మాత్రమే కమిటయ్యాడు. దీంతో బాలయ్యను ఎంత త్వరగా లైన్లో పెడితే అంత త్వరగా సినిమా చేసుకోవచ్చని సీనియర్ దర్శకులంతా ఆయన ఇంటి ముందు క్యూ కడుతున్నారు. అయితే బాలయ్యతో తదుపరి సినిమా అవకాశం ఏ సీనియర్ హీరో దక్కుతుందో వేచి చూడాల్సిందే..!