
వరల్డ్ బిగ్గెస్ట్ రియల్టీ షోగా చెప్పుకునే బిగ్ బాస్.. సింపతి గేమ్ గా మారినట్లు కనిపిస్తోంది. బిగ్ బాస్ తాను పెట్టుకునే నిబంధనలను తానే ఉల్లంఘిస్తున్నాడు. హౌస్ లో కంటెస్టులందరినీ సమానంగా చూడాల్సిన బిగ్ బాస్ అందరినీ ఒకేలా చూడటం లేదని ప్రస్తుత ‘బిగ్ బాస్-4’ చూస్తే అర్థమవుతోంది.
Also Read: త్రివిక్రమ్ తో సినిమాపై మహేష్ ఆసక్తికర ట్వీట్
బిగ్ బాస్-4 గత సీజన్ల కంటే భిన్నంగా నడుస్తోంది. బిగ్ బాస్ తన రూల్స్ ను మార్చుకోవడమేది చాలా అరుదుగా జరిగేది. అయితే ప్రస్తుత సీజన్లో మాత్రం బిగ్ బాస్ తన రూల్స్ తానే తరుచూ బ్రేక్ చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాడు. గంగవ్వను బిగ్ బాస్-4 సీజన్ కు ఎంపిక చేయడం కొత్తగా ఎంటైన్మెంట్ అనిపించినా.. రానురాను ఆమె కారణంగా కంటెస్టులంతా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. దీంతో నామినేట్ ప్రక్రియ సజావుగా జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి.
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం ద్వారా గంగవ్వ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈక్రమంలో ఆమెతో పలువురికి చిన్నచిన్న గొడవలు జరిగాయి. అయినప్పటికీ ఆమెను ఎవరూ నామినేట్ చేసే సాహసం చేయలేకపోతున్నారు. ఆమె విషయంలో కంటెస్టులంతా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. లోపల ఆమెపై కోపం బయటికి మాత్రం గంగవ్వను ఎవరూ నామినేట్ చేయడం లేదు.
గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తొలినాళ్లలో మోనల్.. దీవీలతో ఆమెకు పడలేదు. తెలుగు రాకపోవడంతో మోనల్ ఆమెతో మాట్లాడేదికాదు.. ఈ కారణంగా ఓసారి మోనల్ ను గంగవ్వ నామినేట్ చేసింది. అలాగే దివీపై కూడా పలుసార్లు మాటలతూటలు పేల్చింది. వీరితోపాటు పలువురు గంగవ్వను వ్యతిరేకిస్తున్నారు. అయితే వీరంతా కూడా ఆమె విషయంలో సైలంట్ అవుతూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు.
Also Read: సుశాంత్ కేసులో ట్విస్ట్: రియా ఊపిరి పీల్చుకో..
ఇటీవల జరిగిన ఫ్యాషన్ షో బిగ్ బాస్ హౌస్ లో సేఫ్ గేమ్ కు పరాకష్ఠ నిలిచింది. ఈ ఫ్యాషన్ షోలో గంగవ్వ పాల్గొనకుండా పక్కకు ఉన్నా కంటెస్టులందరూ గంగవ్వనే విజేతగా ప్రకటించారు. దీనిని బిగ్ బాస్ ఎలా ఒప్పుకున్నాడనే ఇంకా మిస్టరీగా మారింది. గంగవ్వ ను బిగ్ బాస్ వయస్సు రీత్య సేఫ్ చేస్తున్నట్లు కన్పిస్తోంది.
కంటెస్టులంతా లోపలికి ఒకటి.. బయటికి ఒకటి చెబుతున్నా బిగ్ బాస్ ఏం చేయకపోవడం గమనార్హం. దీంతో బిగ్ బాస్-4 రియల్టీ షో కాస్తా సింపతి గేమ్ మారుతుందని అభిమానులు అంటున్నారు. ఇలా ఎన్నిరోజులు బిగ్ బాస్ కంటెస్టెంట్లతో సేఫ్ గేమ్ ఆడిస్తారనేది వేచి చూడాల్సిందే..!