Scene Movie: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం సీన్ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతీ సినిమాకు వంకలు చూపించే రివ్యూయర్స్ కూడా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ చెప్పారు. అందుకే మొదటి వీకెండ్ వసూళ్లు అదిరిపోయాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి 3 రోజులకు కలిపి 120 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇక తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 13 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. ఇక ఇతర ప్రాంతాల నుండి ఏ స్థాయి వసూళ్లు వచ్చాయో ఒకసారి వివరంగా చూద్దాం.
తమిళనాడు ప్రాంతం నుండి ఈ చిత్రానికి 3 రోజుల్లో 38 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సూర్య గత చిత్రం ‘విశ్వనాధ్ & సన్స్’ కంటే ఈ చిత్రానికి చాలా మెరుగైన వసూళ్లు వచ్చాయి అనే చెప్పాలి. నేడు కూడా తమిళనాడు ప్రాంతం లో ఈ చిత్రానికి భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. అదే విధంగా కర్ణాటక ప్రాంతం నుండి 7 కోట్ల 5 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, కేరళ నుండి 16 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది. రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 1 కోటి 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి 43 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 120 కోట్ల గ్రాస్ , 57 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి 85 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది, బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇక కేవలం 27 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. మరో రెండు మూడు రోజుల్లో ఈ మార్కుని చాలా తేలికగా అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.