Ramayana Movie: నితీష్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ నెలకొల్పుతూ ముందుకు దూసుకెళ్తోంది. రోజుకి ఒక మైల్ స్టోన్ ని దాటుతూ ట్రేడ్ పండితులను సైతం విస్మయానికి గురయ్యేలా చేసింది. విడుదలకు ముందు ఈ చిత్రం పై ఆడియన్స్ లో , ట్రేడ్ లో పెద్దగా నమ్మకాలు ఉండేవి కాదు. ఎందుకంటే టీజర్ టీవీ సీరియల్ క్వాలిటీ ని తలపించే రేంజ్ లో ఉన్నాయని, మరో ఆదిపురుష్ లాంటి చిత్రం అవుతుందని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలు ట్రైలర్ నుండి మారిపోయాయి. ఒక మంచి క్వాలిటీ సినిమా రాబోతుంది అనే నమ్మకం ఇక్కడి నుండే అందరిలో కలిగింది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ మొదటి ఆట నుండే ఈ చిత్రం ఆడియన్స్ ని అలరించింది.
ఇకపోతే నేడు ఈ చిత్రం బుక్ మై షో యాప్ లో ఆల్ టైం వరల్డ్ రికార్డు ని నెలకొల్పింది. గంటకు 1 లక్షా 40 వేల టికెట్స్ అమ్ముడుపోయి చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం పుష్ప 2 చిత్రానికి మాత్రమే గంటకు 1 లక్షకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఒక్క సినిమాకు కూడా ఈ రేంజ్ బుకింగ్స్ జరగలేదు. వారణాసి తప్ప మరో సినిమాకు పుష్ప 2 రికార్డు ని బ్రేక్ చేసే ఛాన్స్ లేదని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ చిత్రం 1 లక్షా 40 వేల మార్కుని అందుకోవడం ఒక హిస్టారికల్ రికార్డు అనే చెప్పొచ్చు. భవిష్యత్తులో ‘వారణాసి’ చిత్రం ఈ రికార్డు ని ఏ మార్జిన్ తో కొడుతుందో చూడాలి. కానీ ఈ రికార్డుని కొట్టాలంటే కచ్చితంగా పాజిటివ్ టాక్ ని తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు కూడా ‘రామాయణ’ చిత్రం ఇదే రేంజ్ ట్రెండ్ ని కనబర్చే అవకాశాలు ఉన్నాయి.