Bigg Boss 10 Telugu: నేటి బిగ్ బాస్ ఎపిసోడ్ , ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినటువంటి అన్ని ఎపిసోడ్స్ లో ది బెస్ట్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రేక్షకులు గత వారం రోజులుగా త్రిగున్ పై పెట్టుకున్న కోపానికి న్యాయం చేసే ఎపిసోడ్ ఇదేనని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇన్ని రోజులు ఎలా అయితే ఆయన తన తోటి సెలబ్రిటీల బుర్రలో తన పాయింట్స్ ని రిజిస్టర్ చేసి, వాళ్ళని మ్యానిప్యులేట్ చేసి రోహిత్ కి నెగెటివ్ అయ్యేలా చేసాడో, ఇప్పుడు ఆ సెలబ్రిటీలు త్రిగున్ కి రివర్స్ అయ్యి, అతని అసలు రంగుని బయటపెట్టి , ఒకరి తర్వాత ఒకరు నామినేషన్స్ గుద్ది , పాపం వెన్నుపోటు పొడిచేసారు. ఇప్పుడు త్రిగున్ పరిస్థితి ని చూస్తే ఎవరికైనా నవ్వు రాక తప్పదు. వీకెండ్ లో ఈ అంశం పై నాగార్జున కూడా కామెడీ చేసే అవకాశం ఉంది.
హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండే ఎందుకో త్రిగున్ పై సుధీర్ రెడ్డి కి సరైన అభిప్రాయం లేదని మనకి ఒక హింట్ వచ్చింది. వీకెండ్ కి ముందు ముకేశ్ తో కలిసి త్రిగున్ వ్యవహార శైలి పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కచ్చితంగా ఈ సోమవారం నామినేషన్స్ లో త్రిగున్ కి ఈ సెలబ్రిటీలు చుక్కలు చూపించబోతున్నారు అనే క్లారిటీ ప్రేక్షకులకు కూడా వచ్చేసింది. ముఖ్యంగా నేటి ఎపిసోడ్ లో సుధీర్ రెడ్డి హైలైట్ అయ్యాడు అనే చెప్పాలి. సుధీర్ రెడ్డి అసలు ఎందుకు ఈ షో కి వచ్చాడు?, వచ్చినప్పటి నుండి సైలెంట్ గా ఉన్నాడు. ఆ కటౌట్ కి , ఈ సైలెన్స్ కి అసలు మ్యాచ్ అవ్వడం లేదు , ఓపెన్ అవ్వకుంటే ఇంటికి వెళ్ళిపోతాడు అని అంతా అనుకున్నారు. రివ్యూయర్స్ కూడా సుధీర్ ఆట తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు.
అయితే ఒక్కసారిగా సుధీర్ నేడు 8 రోజులకు సరిపడా పెర్ఫార్మన్స్ ని చూపించాడు. త్రిగున్ అసలు రంగుని మొత్తం బయటపెట్టి , అతని నోటి నుండి మాట రానివ్వకుండా చేసాడు. సుధీర్ రెడ్డి ఒక్కసారిగా అలా రివర్స్ అవ్వడం తో త్రిగున్ నోటి నుండి మాట రాలేకపోయింది. ఇక ఆ తర్వాత మరో సెలబ్రిటీ దేబ్జాని కూడా త్రిగున్ ని నామినేట్ చేస్తూ గన్ షాట్ లాంటి పాయింట్స్ పెట్టింది. ఆ తర్వాత వర్షిణి కూడా త్రిగున్ ని నామినేట్ చేసింది. ఇలా ఒక్కసారిగా సెలబ్రిటీలు అందరూ త్రిగున్ కి ఊహించని షాక్ ఇవ్వడం తో , పాపం బాగా డౌన్ అయిపోయాడు. మరోపక్క రోహిత్ అయితే త్రిగున్ కి కన్నీళ్లు రప్పించే రేంజ్ లో డిఫెండ్ చేసాడని చెప్పొచ్చు.