Bellamkonda Sai Sreenivas: ప్రముఖ సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. రీసెంట్ గానే ఆయన జూబ్లీ హిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్ లో కార్ డ్రైవింగ్ చేయడమే కాకుండా, ట్రాఫిక్ పోలీస్ తో చాలా దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సంఘటనకి రియాక్షన్ గా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. కచ్చితంగా ఆయన విచారణకు రావాలని ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రాకపోతే పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమిస్తే ఎంతటి వారికైనా కౌన్సిలింగ్ చేయక తప్పదు. సామాన్యులకు అయితే ఇలాంటి విషయాల్లో పోలీసులు చుక్కలు చూపించేస్తారు. తెలంగాణ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఈమధ్య కాలం లో సెలబ్రిటీలను, సామాన్యులను సమాన భావంతో చూస్తున్నారు అనేది అనేక సందర్భాల్లో రుజువు అయ్యింది.
Also Read: ‘ఉప్పెన’ హీరో ఏమయ్యాడు..? సినిమాలు మానేశాడా..? ప్రస్తుతం ఏం చేస్తున్నాడు?
కాబట్టి బెల్లంకొండ శ్రీనివాస్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల విషయానికి వస్తే ఈయన 2021 వ సంవత్సరం లో విడుదలైన ‘అల్లుడు అదుర్స్’ చిత్రం తర్వాత మళ్ళీ తెలుగు ఆడియన్స్ కి కనిపించలేదు. 2023 వ సంవత్సరం లో ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి పరువు పోగొట్టుకున్నాడు. కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది. దీంతో మళ్ళీ ఆయన టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కోలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘గరుడన్’ చిత్రానికి రీమేక్ గా ‘భైరవం’ అనే చిత్రం చేసాడు. ఈ చిత్రం లో ఆయన తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ కూడా నటించారు.
ఈ ముగ్గురిలో మెయిన్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నే. మంచు మనోజ్ ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చేసాడు. తమిళ దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ ఇందులో హీరోయిన్ గా నటించింది. గత ఏడాదే ఈ సినిమా విడుదల అవ్వాలి కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ నెల 30న విడుదల కాబోతుంది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని మరో రెండు మూడు రోజుల్లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తో పాటు బెల్లం కొండా శ్రీనివాస్ టైజన్ నాయుడు, హైందవ, కిష్కిందపూరి వంటి చిత్రాల్లో కూడా నటించాడు. ప్రస్తుతం ఇవి చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఒకప్పుడు మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న బెల్లకొండ శ్రీనివాస్, ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతవరకు అలరిస్తాడో చూడాలి.