Salman khan- Samantha: “ఊ అంటావా మావా.. ఊహు అంటావా” అంటూ సమంత బోల్డ్ లోకాన్ని ఆకట్టుకునేలా హద్దులు మీరి మరీ రెచ్చిపోయింది. టూ-పీస్ గౌను వేసుకుని, తనలోని అందాలను విపరీతంగా ఆరబోస్తూ గ్లామర్ ప్రపంచం పై నిప్పులు రాజేసింది. పైగా ఆ పాటలో అల్లు అర్జున్ తో సమంత చేసిన డ్యాన్స్ విజువల్స్ కూడా పరిధి దాటాయి.
పైగా లిరికల్ వీడియోలోని స్టిల్స్ లో కూడా సమంత తన అందాలను సాంతం పరిచేసింది. దీనికితోడు స్పష్టమైన ఎఫెక్ట్ లు, ఇక నటిగా సామ్ ధరించిన దుస్తులు కూడా ఊపు పెంచాయి. అందుకే ఈ సాంగ్ పై సినీ ప్రముఖులు కూడా మనసు పారేసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను కూడా ఈ పాట బాగా ఆకట్టుకుంది.

ఓ ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నాడు. దాంతో సదరు యాంకర్ ఉత్సాహంగా సల్లూ భాయ్ తో ‘ఈ మధ్య కాలంలో మిమ్మల్ని బాగా ఇన్‌స్పైర్ చేసిన సాంగ్ ఏమిటి ? అంటూ ప్రశ్నించింది. సహజంగా హిందీ పాట చెబుతాడు అని అందరూ అనుకుంటారు. కానీ సల్మాన్ మాత్రం ‘ఊ అంటావా మావా’ అంటూ హమ్ చేస్తూ మొత్తానికి షాక్ ఇచ్చాడు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది కూడా.
Also Read: Theaters Close In AP: ఏపీలో ధియేటర్లు క్లోజ్.. కారణం అదే ?
ఈ క్రమంలో ఈ వీడియో చూసిన సమంత తెగ సంబర పడిపోయింది. సల్లూ భాయ్ వీడియోను రీట్వీట్ చేస్తూ ఎరుపు రంగులో ఉన్న హార్ట్ ఎమోజీస్ ను పోస్ట్ చేసి.. తన సంతోషాన్ని చాటుకుంది. ప్రస్తుతం సామ్ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. మొత్తానికి అక్కినేని కుటుంబం నుంచి ‘సమంత’ బయటకు వచ్చేసిన తర్వాత.. తన గ్లామర్ షోతో అడ్డు అదుపు లేకుండా రోజురోజుకు రెచ్చిపోతుంది.
తన ఫ్యాన్స్‌కు నిత్యం ఎక్స్ ఫోజింగ్ తో మజాను పంచడానికి తెగ శ్రమిస్తోంది. ఇందులో భాగంగా తన తన హాట్ హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అలాగే సినిమాల పరంగా కూడా తన వేగాన్ని రెట్టింపు చేసింది. హిందీలో కూడా వరుస సిరీస్ లు, సినిమాలు ఒప్పుకుంటూ దూసుకువెళ్తుంది. మరి సల్మాన్ ఖాన్ ను ఆకట్టుకుంది కాబట్టి.. కండల వీరుడి సినిమాలో కూడా సామ్ నటిస్తోందేమో చూడాలి.

Also Read: Mahesh- Rajamouli Movie: మహేష్ – రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
♥️♥️♥️ https://t.co/UzkF0PVspl
— Samantha (@Samanthaprabhu2) June 26, 2022
[…] Also Read: Salman khan- Samantha: సల్మాన్ ఖాన్ కి సమంత లవ్ సిం… […]
[…] Also Read: Salman khan- Samantha: సల్మాన్ ఖాన్ కి సమంత లవ్ సిం… […]