spot_img
Homeఎంటర్టైన్మెంట్Sai Pallavi: is not a star heroine ...సాయి పల్లవిని స్టార్ హీరోయిన్ కానివ్వరా......

Sai Pallavi: is not a star heroine …సాయి పల్లవిని స్టార్ హీరోయిన్ కానివ్వరా… చెల్లి చెల్లి అంటూ ఈ గోలేంటి?

Sai Pallavi:  సాయి పల్లవి హీరోయిన్స్ లో ఓ అరుదైన రకం. పాతకాలపు పద్ధతులు పాటించే ఈ తరం అమ్మాయి. వాస్తవం మాట్లాడాలంటే సాయి పల్లవి గొప్ప అందగత్తె కాదు. చూడటానికి పర్వాలేదు అన్నట్లు ఉంటుంది. కేవలం టాలెంట్ ని నమ్ముకొని హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో సాయి పల్లవి నటించిన చిత్రాలన్నీ దాదాపు హిట్. ఫిదా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొత్తగా… ఆ సినిమా విజయంలో క్రెడిట్ మొత్తం సాయి పల్లవికే దక్కాలి. ఆ సినిమాలో ఆమె పాత్ర అంత బలంగా ఉంటుంది. అలాంటి అద్భుతమైన పాత్రను సాయి పల్లవి తన నటనతో మరింత ఆకర్షణీయంగా మలిచారు.

Sai Pallavi:
Sai Pallavi:

ఇక సాయి పల్లవి నటించిన గత రెండు చిత్రాలు సూపర్ హిట్. నాగ చైతన్యతో చేసిన లవ్ స్టోరీ 2021 సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇటీవల క్రిస్మస్ కానుకగా విడుదలైన శ్యామ్ సింగరాయ్ సైతం మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడుతున్నా… నటిగా తనని తాను నిరూపించుకుంటున్న, స్టార్ హీరోలు ఆమె వైపు కన్నెత్తి చూడటం లేదు.

Also Read: రేషన్ కార్డును పోగొట్టుకున్నారా.. డూప్లికేట్ కార్డును ఏ విధంగా పొందాలంటే?

ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, పవన్, రామ్ చరణ్ వంటి టాప్ స్టార్స్ సాయి పల్లవిని తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకోవడం లేదు. గ్లామర్ పరంగా సాయి పల్లవి మైనస్ కావచ్చు. కానీ కమర్షియల్ హీరోయిన్ కి కావలసిన లక్షణాలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. మంచి డాన్సర్, యాక్టర్. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ఎలాంటి పాత్రనైనా రక్తి కట్టించే సత్తా ఆమెలో ఉంది.

sai-pallavi-believes-reincarnation-and-here-how

కానీ ఆమెకు స్టార్ హీరోతో ఒక్క అవకాశం కూడా రావడం లేదు. స్టార్ హీరోలు ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇవ్వకపోగా కెరీర్ కి చరమగీతం పాడే ప్రయత్నం చేస్తున్నారు. వరుస విజయాలతో ఫార్మ్ లో ఉన్న ఆమెను చెల్లి పాత్రలు చేయాలంటూ ఇబ్బంది పడుతున్నారు. ఆ మధ్య చిరంజీవి చెల్లిగా చేయాలంటూ ఓ ఆఫర్ ఆమె వద్దకు వెళ్ళింది. ఆ ఆఫర్ సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించారు.

Sai Pallavi

తాజాగా మహేష్ పక్కన చెల్లిగా చేయాలంటూ మేకర్స్ ఆమెను కలిశారని కథనాలు వెలువడుతున్నాయి. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో మహేష్ చెల్లెలు పాత్ర చేయాలని సాయి పల్లవిని అడుగుతున్నారట. ఈ ఆఫర్ సాయి పల్లవి అంగీకరించారా? రిజెక్ట్ చేశారా? అనేది ఇంకా తెలియదు. ఏది ఏమైనా స్టార్ హీరోయిన్ కావాలని సాయి పల్లవి తపిస్తుంటే.. స్టార్ హీరోలు ఆమెను చెల్లిగా మార్చేయాలని చూస్తున్నారు.

Also Read: కరోనాను కట్టడి చేసే మొక్క ఇదే.. ఈ మొక్క ఎక్కడ దొరుకుతుందంటే?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Oktelugu Epaper