Homeఎంటర్టైన్మెంట్Rowdy Janardhan Glimpse Video: విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్దన్' గ్లింప్స్ వీడియో వచ్చేసింది..పోకిరి రేంజ్...

Rowdy Janardhan Glimpse Video: విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన్’ గ్లింప్స్ వీడియో వచ్చేసింది..పోకిరి రేంజ్ హీరోయిజం!

Rowdy Janardhan Glimpse Video: అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ఆ రెండు సినిమాలు మినహా కెరీర్ లో సరైన సక్సెస్ లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. గీతా గోవిందం తర్వాత ఆయన హీరో గా నటించిన చిత్రాల్లో కేవలం ‘టాక్సీ వాలా’ ఒక్కటే కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. ఆ […]

Rowdy Janardhan Glimpse Video: అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ఆ రెండు సినిమాలు మినహా కెరీర్ లో సరైన సక్సెస్ లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. గీతా గోవిందం తర్వాత ఆయన హీరో గా నటించిన చిత్రాల్లో కేవలం ‘టాక్సీ వాలా’ ఒక్కటే కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ది ఫ్యామిలీ స్టార్, ఖుషి, రీసెంట్ గా విడుదలైన కింగ్డమ్, ఇలా ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతూ వచ్చింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కి అర్జెంటు గా ఒక హిట్ కావాలి. ‘కింగ్డమ్’ చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయినప్పటికీ, ఒక సెక్షన్ ఆడియన్స్ కి ఆ చిత్రం బాగా నచ్చింది.

పర్వాలేదు ఈ సినిమాతో కాకపోయినా, తదుపరి చిత్రం తో పూర్తిగా ట్రాక్ లోకి వచేస్తాడని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ ఉన్నట్టుగా ఆయన తదుపరి చిత్రాలని చూస్తేనే అర్థం అవుతోంది. ప్రస్తుతం ఆయన దిల్ రాజు బ్యానర్ లో ‘రౌడీ జనార్దన్’ ఏ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. గతం లో ఈయన ‘రాజా వారు..రాణి వారు ‘, ‘ఆకాశవనం లో అర్జున కళ్యాణం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. మంచి దర్శకుడు అనే పేరు ని తెచ్చుకున్న ఇతనికి విజయ్ దేవరకొండ అవకాశం ఇచ్చినప్పుడే సగం సక్సెస్ అయ్యినట్టు. ఈ చిత్రం లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈమె ఒక సబ్జెక్టు ఎంచుకుందంటే, స్క్రిప్ట్ చాలా బలంగా ఉందని ఫిక్స్ అయిపోవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ ని ఈ నెల 22 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఇంతలోపు ఒక చిన్న గ్లింప్స్ వీడియో ని వదిలారు, ఈ వీడియో లో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్స్, చివర్లో ఆయన కూర్చున్న తీరుని చూస్తే పోకిరి తరహా హీరోయిజం గుర్తుకొచ్చింది. చూస్తుంటే ఈ సినిమా ఇద్దరు స్నేహితులకు సంబంధించినది అని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రం లో విలన్ గా సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్నట్టు సమాచారం. చాలా వరకు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే నేడు విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము, చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper