Bigg Boss 10 Telugu: దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అసలు లిమిట్ అనేదే లేకుండా , ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే ఎలా ఉంటుందో , అందుకు బెస్ట్ ఉదాహరణ ఈ సీజన్ కంటెస్టెంట్ త్రిగున్. గత సీజన్స్ లో మనం ఎంతో మంది భిన్నమైన వ్యక్తిత్వం గల కంటెస్టెంట్స్ ని చూశాం కానీ , ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న కంటెస్టెంట్ ని అసలు చూడలేదు. ఈ మనిషిలో ఒక్కటైనా మంచి క్వాలిటీ ఉంటుందేమో అని వెతకడం మొదలు పెడితే , ఒక్కటి కూడా దొరకడం లేదు. ప్రతీ విషయం లో వేలు పెట్టడం, ఒకరి గురించి చెడుగా మాట్లాడడం, తన తోటి కంటెస్టెంట్స్ బుర్రలను మ్యానిప్యులేట్ చేయడం, ఇష్టమొచ్చినట్టు నోరు జారడం, ఇలా ఒక్కటా రెండా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది. మళ్లీ హౌస్ లో ఇతనికి ఒక బ్యాచ్ కూడా ఉంది , ఈయన ఏమి చేసిన కరెక్ట్ అనుకునే బ్యాచ్ అది.
ఇతనితో ఉండడం వల్ల వాళ్ళు కూడా బాగా నెగెటివ్ అయిపోయారు. అలా నెగెటివ్ అయినా కంటెస్టెంట్స్ ఝాన్సీ, దేబ్ జానీ, వర్షిణి, కృష్ణుడు. ఇకపోతే నిన్నటి ఎపిసోడ్ లో ఈయన రోహిత్ పై నోరు జారిన విధానం చూస్తే ఎలాంటి వాళ్లకు అయినా బీపీ ఒక రేంజ్ లో వస్తుంది. రోహిత్ ని డొల్ల రాజా అంటూ కామెంట్ చేయడం. అతను అగ్ని పరీక్ష షో నుండి వస్తే , తొక్కలో అగ్ని పరీక్ష అనడం, బచ్చ గాడివి అంటూ మరో కామెంట్ పాస్ చేయడం వంటివి నిన్నటి ఎపిసోడ్ లో జరిగింది. వీటి అన్నిటికంటే మరో దారుణమైన మాట కూడా ఉన్నాడు. ‘బిగ్ బాస్ 7’ లో యావర్ ని గౌతమ్ ఒక మాట అంటాడు గుర్తుందా?, ఆ మాట అన్నందుకు యావర్ గౌతమ్ ని కొట్టినంత పని చేశాడు.
వీకెండ్ లో నాగార్జున ఈ విషయాన్ని అడ్రెస్స్ చేస్తూ గౌతమ్ కి కోటింగ్ ఇస్తాడు. ఇప్పుడు త్రిగున్ కి అంతకు మించిన కోటింగ్ జరిగే అవకాశం ఉంది. రెడ్ కార్డు వార్నింగ్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. త్రిగున్ అన్ని లిమిట్స్ ని దాటేశాడని , కచ్చితంగా అతనికి రెడ్ కార్డు ఇవ్వాల్సిందే అని , ఒక వేళ అవకాశం ఇస్తే , రోహిత్ దయ మీద ఉంచాలని , అప్పుడే అతని పొగరు , యాటిట్యూడ్ క్రిందకు దిగుతాయని అంటున్నారు. మరి నాగార్జున అందరి అంచనాలకు , కోరికకు తగ్గట్టుగా త్రిగున్ కి రెడ్ కార్డు వార్నింగ్ ఇస్తాడా?, లేదా అనేది తెలియాలంటే రేపు రాత్రి వరకు ఆగాల్సిందే.