Bigg Boss 10 Telugu: రాజు లేకుండా రాజ్యం ఎలా నడుస్తుంది? , ఏ కథ ని ఉదాహరణకు తీసుకున్నా , కథానాయకుడు లేకుండా ఉండదు, కానీ ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ కి మాత్రం కథానాయకుడు లేడు , జనాల్లో అతనికి ఉన్న అత్యంత ఆదరణ చూసి తట్టుకోలేక , సెలబ్రిటీలు , బిగ్ బాస్ టీం, నాగార్జున , ఇలా అందరూ కలిసి అతన్ని ఎలిమినేట్ చేసి పంపించేశారు. అతను మరెవరో కాదు , రోహిత్ నాయుడు. మనిషిని అయితే ఎలిమినేట్ చేసి పంపేశారు కానీ, అతను క్రియేట్ చేసిన ఇంప్యాక్ట్ ని మాత్రం చెరపలేకపోయారు. ఎలిమినేట్ అయినా రోజు నుండి నిన్నటి వరకు , ప్రతీ కంటెస్టెంట్ రోహిత్ గురించే జపం చేశారు. ముఖ్యంగా అమన్ రోహిత్ కి ఎందుకు వెన్నుపోటు పొడిచాడో నిన్న లైవ్ చూస్తే అందరికీ అర్థం అవుతుంది.
హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి , గత వారం వరకు కూడా , రోహిత్ అమన్ కి తన స్నేహితుల లిస్ట్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు కానీ , అన్యాయం మాత్రం చేయలేదు. అమన్ ఆట మెరుగుపడే సలహాలే ఇచ్చాడు కానీ , త్రిగున్ లాగా మోసం మాత్రం చేయలేదు. కానీ అమన్ మాత్రం గట్టి మోసమే చేసాడు. రోహిత్ ఈరోజు రెడ్ జోన్ లో ఉండడానికి , ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోవడానికి ప్రధాన కారణం అమన్ మాత్రమే. అతని వద్ద ఉన్నటువంటి స్టార్ ని తిరిగి తీసుకోకుండా ఉండుంటే , రోహిత్ గెలిచేవాడు , ఎల్లో లెవెల్ కి వెళ్లిపోయేవాడు. కానీ త్రిగున్ మాయ మాటలకు పడిపోయి , అతను ఎలా ఆడిస్తే అలా ఆడే పరిస్థితి ఏర్పడింది. చివరికి విన్నర్ రేంజ్ లో ఉన్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యేందుకు కారణం అయ్యాడు.
అయితే నిన్నటి నామినేషన్ ఎపిసోడ్ కూడా రోహిత్ చుట్టూనే తిరిగింది. సుధీర్ అమన్ ని నామినేట్ చేస్తూ , ఒక స్నేహితుడివి అయ్యుండి , రోహిత్ కి వెన్నుపోటు పొడవడం చాలా అన్యాయం అనిపించింది , చాలా బాధ వేసింది, నీలాంటి వాళ్లకు ఇక్కడ చోటు లేదంటూ అమన్ ని నామినేట్ చేసాడు. అందుకు అమన్ ఇచ్చిన సమాధానాలు కూడా బాగాలేవు, రోహిత్ నన్ను స్నేహితుడు కాదు అన్నాడు కాబట్టి , నేను వాడిని స్నేహితుడిగా బావించలేదంటూ కవరింగ్ చేసుకున్నాడు. ఇక ముకేశ్ అయితే రోహిత్ కి ఒక మాట ఇస్తూ త్రిగున్ ని తొక్కుకుంటూ వెళ్తానని అన్నావు , కానీ చేయలేకపోయావు , ఇప్పుడు నేను నీకు మాట ఇస్తున్నాను, నువ్వు చెప్పింది నీ తరుపున చేసి చూపిస్తాను, బయట నుండి చూడు రోహిత్ అంటూ ముకేశ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అయితే ఈ వారం లోనే రోహిత్ రీ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఈ వారం మొత్తం ‘రివార్డ్స్ అండ్ రివెంజ్’ థీమ్ నడుస్తుందని , కాబట్టి రోహిత్ ని టాస్కుల మధ్యలో హౌస్ లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతానికి హౌస్ లో రోహిత్ లేకపోయినా , గేమ్ మొత్తం అతని చుట్టూనే నడుస్తోంది, మరి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.