Homeఎంటర్టైన్మెంట్రాముడు సీత కూడా నాన్ లోకలే: ఆర్జీవీ

రాముడు సీత కూడా నాన్ లోకలే: ఆర్జీవీ

RGVమూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలలో పోటీ రోజురోజుకు పెరుగుతుంది. అసలు ఎప్పుడో సెప్టెంబర్‌లో జరగాల్సిన ఎన్నికలకు 3 నెలల ముందే ఇంత హడావుడి అవసరమా అనేది సగటు ప్రేక్షకుడి ప్రశ్న. కానీ బరిలో నిలిచిన ప్యానెల్స్ మధ్య వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. మరోపక్క బయట వ్యక్తులు కూడా ఈ ఎన్నికల పై రకరాలుగా కామెంట్స్ చేయడంతో మా ఎన్నికలు కారణంగా మళ్ళీ వర్గాలుగా మారిపోయారు సినిమా వాళ్ళు.

అయితే మా అధ్యక్షుడి స్థానం కోసం ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ పోటీ చేస్తున్నారు. ఎలాగూ హేమను కూరలో కరివేపాకులా పక్కన పెట్టేశారు. అలాగే ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అంటూ ఆయన్ని కొంతమంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదాల నాయకుడు వర్మ ఈ వ్యవహారం పై తనదైన శైలిలో ట్వీట్లతో విరుచుకుపడ్డాడు.

ఆర్జీవీ ట్వీట్లలో మ్యాటర్ విషయానికి వస్తే.. ‘ప్రకాశ్‌ రాజ్‌ కన్నడిగుడు కావొచ్చు. కానీ ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉండి తెలుగు కూడా నేర్చుకొని, చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ , తెలంగాణ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని , అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న ప్రకాశ్‌ రాజ్‌ నాన్‌ లోకలా’ ? అంటూ వర్మ ఆవేశంగా ప్రశ్నించాడు.

అలాగే మరో ట్వీట్ లో ‘కర్ణాటక నించి ఏపీకి వచ్చిన ప్రకాశ్‌రాజ్‌ నాన్‌ లోకల్‌ అయితే, మరి మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్, అదే విధంగా ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ లోకలా ?’ అని కాస్త గట్టిగానే అడుగుతున్నాడు ఆర్జీవీ. పనిలో పనిగా మరో వివాదస్పద ట్వీట్ చేస్తూ ‘మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ నాన్ లోకల్ .. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్.. రాముడు సీత కూడా నాన్ లోకల్’ అంటూ చెప్పుకొచ్చాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...
Oktelugu Epaper