spot_img
Homeఎంటర్టైన్మెంట్రిపీట్ అవుతున్న కాంబో.. స‌క్సెస్ రిపీట్ అవుతుందా?

రిపీట్ అవుతున్న కాంబో.. స‌క్సెస్ రిపీట్ అవుతుందా?

Hit Combo
సినిమా ఇండ‌స్ట్రీలో చాలా కాంబినేష‌న్లు ఉంటాయి. కానీ.. హీరో-ద‌ర్శ‌కుడు కాంబినేష‌న్ పైనే ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది. ఇద్ద‌రూ క‌లిసి రెండో చిత్రం చేస్తున్నారంటే.. అంచ‌నాలు అమాంతం పెరిగిపోతాయి. మొద‌టి సినిమాతో కంపేర్ చేసుకుంటూ లెక్క‌లు వేసుకుంటారు ప్రేక్ష‌కులు, అభిమానులు. ఇప్పుడు టాలీవుడ్లో ఈ సెకండ్ ఫేజ్ మూవీస్ చాలానే తెర‌కెక్కుతున్నాయి. మ‌రి, ఆ హీరోలు, ద‌ర్శ‌కులు ఎవ‌రు? వారి చిత్రాల వివరాలేంటన్నది చూద్దామా?

Also Read: ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ లో హాలీవుడ్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌.. క్లైమాక్స్ రోమాంచితమేనా!

ప‌వ‌న్ – హ‌రీష్ః ‘మాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ చేసిన హంగామా మామూలుది కాదు. వీరి కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బాక్సాఫీస్ ను దున్నేసింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరోసారి ఆడియన్స్ ను ఎంట‌ర్ టైన్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ‘పీఎస్ పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్ర కథను రెడీ చేస్తున్నాడు హరీష్ శంకర్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సంచలనం దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.

తారక్ – త్రివిక్రమ్ః మాట‌ల మాంత్రికుడు, యంగ్ టైగ‌ర్ కాంబోలో వ‌చ్చిన చిత్రం ‘అరవింద సమేత’. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం న‌మోదు చేసింది. వీరిద్ద‌రూ క‌లిసి మ‌రోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇది ఎన్టీఆర్ కు 30వ సినిమా. ‘ఎన్టీఆర్-30’ వర్కింగ్ టైటిల్ తో సిద్ధమవుతున్న ఈ సినిమాను హారిక్ అండ్ హాసిని క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.

శివ-నానిః ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌, హీరో నాని ఇద్ద‌రూ ల‌వ్ స్టోరీల‌తోనే ప్రేక్ష‌కుల ముందుకు ఎక్కువ‌గా వ‌చ్చారు. గ‌తంలో నిన్నుకోరి సినిమాతో వీరిద్ద‌రూ జ‌ట్టుక‌ట్టారు. ఇప్పుడు వీరిద్ద‌రి మ‌ధ్య రెండో సినిమా రాబోతోంది. అదే ‘ట‌క్ జ‌గ‌దీష్‌’. అన్న‌ద‌మ్ముల అనుబంధం నేప‌థ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఎమోష‌న్‌, యాక్ష‌న్ స‌న్నివేశాల మేళ‌వింపుతో ఈ సినిమా రూపొందుతోంది. షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 23న రాబోతోంది.

Also Read: 2 షిఫ్టులు.. ఆగమాగం.. దర్శకులకు చుక్కలు చూపిస్తున్న పవన్?

వెంకీ-శ్రీకాంత్ః వీళ్లిద్ద‌రి కాంబోలో గ‌తంలో వ‌చ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా అందరినీ ఆక‌ట్టుకుంది. దీంతో.. వీరిద్ద‌రి మ‌ధ్య మంచి బాండింగ్ ఏర్ప‌డింది. ఇప్పుడు వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో మ‌రో సినిమా రాబోతోంది. అదే.. ‘నారప్ప’. త‌మిళ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన అసుర‌న్ సినిమాకు ఇది రీమేక్‌. అయితే.. కుటుంబ క‌థ‌ల‌కు కేరాఫ్ గా నిలిచే శ్రీకాంత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌డంతో.. ఎలాంటి టేకింగ్ ఉంటుందోన‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. మే 14న ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు.

ర‌వితేజ – ర‌మేష్ః మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ క‌లిసి గ‌తంలో ‘వీర’ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘ఖిలాడి’ చిత్రంలో ఆడియ‌న్స్ ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ మూవీ కూడా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఉండ‌బోతోంది. ఇందులో ర‌వితేజ రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో కనిపించ‌నున్నారు. మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తీ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తున్నారు. మే 28న ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Oktelugu Epaper