Homeఎంటర్టైన్మెంట్Ravi Teja Meher Ramesh New Movie: రవితేజ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో...

Ravi Teja Meher Ramesh New Movie: రవితేజ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో కొత్త సినిమా రాబోతోందా..? షాక్ లో ఉన్న ఫ్యాన్స్…

Ravi Teja Meher Ramesh New Movie: సినిమా ఇండస్ట్రీలో ఎవరి పేరు చెప్తే హీరోలు సైతం దడుచుకుంటారో? ఎవరి సినిమాలను చూడడానికి ప్రేక్షకులు చిరాకు పడతారో? ఎవరి పేరు చెబితే ప్లాప్ సినిమాలు గుర్తుకు వస్తాయో అతనే మెహర్ రమేష్… అతని డైరెక్షన్లో వచ్చిన ఐదు సినిమాల్లో ‘బిల్లా’ సినిమాను మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు కూడా డిజాస్టర్లుగా మారాయి. మరి అలాంటి దర్శకుడు ప్రస్తుతం రవితేజ తో సినిమా చేయబోతుండనే వార్తలైతే సోషల్ మీడియాలో […]

Ravi Teja Meher Ramesh New Movie: సినిమా ఇండస్ట్రీలో ఎవరి పేరు చెప్తే హీరోలు సైతం దడుచుకుంటారో? ఎవరి సినిమాలను చూడడానికి ప్రేక్షకులు చిరాకు పడతారో? ఎవరి పేరు చెబితే ప్లాప్ సినిమాలు గుర్తుకు వస్తాయో అతనే మెహర్ రమేష్… అతని డైరెక్షన్లో వచ్చిన ఐదు సినిమాల్లో ‘బిల్లా’ సినిమాను మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు కూడా డిజాస్టర్లుగా మారాయి. మరి అలాంటి దర్శకుడు ప్రస్తుతం రవితేజ తో సినిమా చేయబోతుండనే వార్తలైతే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీని మీద రవితేజ అభిమానులు సైతం చాలా వరకు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. మెహర్ రమేష్ డైరెక్షన్లో రవితేజ సినిమా చేస్తే మేము అసలే ఒప్పుకోము అంటూ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు

కారణం ఏంటి అంటే ఆయన ఒకదానిని మించిన ఒకటి అల్ట్రా డిజాస్టర్ లను అందించాడు. తనకు సినిమాలు చేయడం రాదని అది అతను తెలుసుకుంటే మంచిదని మరి కొంతమంది అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా స్టార్ హీరోలతోనే సినిమాలు చేయడం కాకుండా చిన్న హీరోలతో కూడా సినిమాలను చేసి తన సత్తా ఏంటో చూపించుకుంటే అతని మీద ఎలాంటి ట్రోలింగ్స్ రావని మరికొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…

ఇక ప్రస్తుతం రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి ఎలాగైనా సరే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దానికి సంబంధించిన వర్క్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఒక డీసెంట్ రవితేజను మనం చూడబోతున్నాము అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో కనిపించిన రవితేజ వేరు. ఇప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో వస్తున్న రవితేజ వేరు అని అతని అభిమానులు కూడా అతని గురించి చాలా బాగా చెబుతున్నారు. అతనితో సినిమా చేయడం ఎందుకు అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక రవితేజ మాత్రం ఈ విషయంలో ఎలా స్పందిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. మెహర్ రమేష్ తో నిజంగానే సినిమా చేస్తున్నాడా? లేదంటే కావాలని కొంతమంది ఇలాంటి న్యూస్ ని క్రియేట్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper