Rashmika Mandanna: క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’ పై నెటిజన్లు విపరీతంగా సీరియస్ అవుతున్నారు. రష్మిక చేసిన పని దారుణం అంటూ నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తూ బండ బూతులు తిడుతున్నారు. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే.. షూటింగ్ నిమిత్తం రష్మిక నిన్న ముంబై వెళ్ళింది. అక్కడ ఓ హోటల్ లో దిగింది.

అయితే, ఆ హోటల్ దగ్గర అడుక్కునే ఓ పాపకు రష్మిక అక్కడికి వచ్చింది అని తెలిసింది. దాంతో ఆ పాప రష్మిక రాక కోసం ఎంతగానో ఎదురుచూసి తీరా హోటల్ నుంచి రష్మిక బయటకు రాగానే ఓ చిన్నారి వచ్చి అడుక్కోవడం ప్రారంభించింది. ఆ పాపను సెక్యూరిటీ గార్డులు పక్కకు నెట్టారు.
Also Read: దాని కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదు.. ఎమోషనలైన మహేష్ బాబు వైఫ్ !
అయినా ఆ పాప రష్మికను ప్రాధేయపడుతూ.. ‘ఆకలేస్తుంది…తినాలి.. ఏమైనా ఉంటే ఇవ్వండి’ అని అడిగింది. రష్మిక మాత్రం నవ్వుతూనే వెళ్లిపోయింది. ఒక్క రూపాయి కూడా తీసి ఆ పాపకు ఇవ్వలేదు. చిన్నారి అడుక్కుంటున్నా పట్టించుకోకుండా రష్మిక వెళ్లిపోవడంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ క్రేజీ బ్యూటీ ప్రస్తుతం హిందీ సినిమాల పై మోజు పెంచుకుంది.

అందుకే, బాలీవుడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఫోకస్ తో పాటు ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు మొహమాటం లేకుండా రెచ్చిపోతుంది.నిన్న ముంబై ఎయిర్ పోర్టులో టీ-షర్ట్, షార్ట్ ధరించి ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది.
రష్మిక. దీంతో ఆమె ఫొటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్లు రష్మిక డ్రెస్సింగ్‌పై కుడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక రష్మిక ప్రస్తుతం చేస్తున్న హిందీ సినిమాలు ‘గుడ్ బై’. మరో సినిమా ‘మిషన్ మజ్ను’.
Also Read: చీకటి పడ్డాక ఈ వస్తువులు, పదార్థాలను ఇవ్వొద్దు.. ఎందుకో తెలుసా?
[…] Mahesh – Keerthi Suresh: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఒక అప్ డేట్ వచ్చింది. పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని తొలి పాటను ప్రేమికుల రోజున(ఫిబ్రవరి 14న) విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుండగా.. తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. […]