Homeఎంటర్టైన్మెంట్Rashmi Gautam: కాబోయే భర్తను పరిచయం చేసిన రష్మీ... షాక్ లో సుడిగాలి సుధీర్

Rashmi Gautam: కాబోయే భర్తను పరిచయం చేసిన రష్మీ… షాక్ లో సుడిగాలి సుధీర్

రష్మీ - సుడిగాలి సుధీర్ ఇలా చెబుతున్నా వారు స్టేజ్ మీదున్న సమయంలో నటనలా అనిపించదని, సహాజంగానే ఉంటుందని అభిమానులు, ప్రేక్షకులు కామెంట్స్ చేస్తుంటారు.

Rashmi Gautam: యాంకర్ రష్మీ.. బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్న రష్మీ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్, ఢీ వంటి షోల ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాదు పలు ప్రోగ్రాం లో సుడిగాలి సుధీర్, రష్మీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని ప్రేక్షకులు భావిస్తుంటారు. అంతేకాదు వీరిద్దరు కలిసి ఎప్పుడు కనిపించినా బయట కూడా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నిస్తారు చాలా మంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ జంటకు ఉన్న ఫాలోయింగ్ గురించి. అయితే ఆ ప్రేమ మొత్తం నటన మాత్రమేనని, ఆన్ స్క్రీన్ కోసం తప్ప తమ మధ్య ఏం లేదని, తాము ఇద్దరం మంచి స్నేహితులమంటూ సుధీర్, రష్మీ చాలాసార్లు చెప్పుకొచ్చారు.

అయితే రష్మీ – సుడిగాలి సుధీర్ ఇలా చెబుతున్నా వారు స్టేజ్ మీదున్న సమయంలో నటనలా అనిపించదని, సహాజంగానే ఉంటుందని అభిమానులు, ప్రేక్షకులు కామెంట్స్ చేస్తుంటారు. ఈ
క్రమంలోనే వారిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉందని చెప్పుకొస్తుంటారన్న సంగతి కూడా తెలిసిందే.

బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా రష్మీ, సుధీర్ లు రాణిస్తున్నారు. తాజాగా రష్మీ తన పెళ్లి గురించి మాట్లాడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈటీవీలో రష్మీ పెళ్లి పార్టీ అని ఒక ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లోనే రష్మీ తనకు కాబోయే భర్తను సైతం పరిచయం చేసింది. అయితే అతను మన దేశానికి చెందిన వ్యక్తి కాదు. విదేశీయుడు అని తెలుస్తోంది.

సాధారణంగా ప్రతి అమ్మాయికి తనకు కాబోయే భర్త ఇలా ఉండాలి. అలా ఉండాలి అంటూ కొన్ని ఇమాజినేషన్ ఉంటాయి. ఈ సందర్భంగా తన ఇమాజినేషన్ లో ఉన్న వ్యక్తి ఇతనేనని రష్మీ చెప్పింది. జంట చూడటానికి బావున్నా కొందరు మాత్రం ఈవెంట్ కోసమే ఇలా చెబుతున్నారని అంటున్నారు. మరి కొందరు మాత్రం ఇది నిజమైతే సుధీర్ పరిస్థితి ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజమెంత ఉందనే దానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper