Ranabaali Movie: వరుస ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ కి , అర్జెంటు గా ఒక హిట్ పడడం అవసరం. ‘అర్జున్ రెడ్డి’ , ‘గీత గోవిందం’ వంటి బ్యాక్ టు బ్యాక్ భారీ బ్లాక్ బస్టర్స్ తర్వాత , విజయ్ దేవరకొండ రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్ళిపోతుంది , పాన్ ఇండియా హీరో అయిపోతాడని అంతా అనుకున్నారు. కానీ ఆ రెండు సినిమాల తర్వాతే ఆయనకు అసలు కష్టాలు మొదలయ్యాయి. ‘గీత గోవిందం’ తర్వాత ఆయన చేసిన సినిమాల్లో ‘టాక్సీ వాలా’ ఒక్కటే యావరేజ్ గా ఆడింది. మిగిలిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆయన గత చిత్రం ‘కింగ్డమ్’ కూడా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆశలన్నీ ‘రణబాలి’ మీదనే ఉన్నాయి.
ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలి అనే కసితో ఆయన ‘రణబాలి’ చిత్రాన్ని చేసినట్టుగా అనిపిస్తోంది. ఈ నెల 15 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షో ని నిన్న ప్రసాద్ ల్యాబ్స్ లో వేశారు మేకర్స్. అక్కడి నుండి లీకైన టాక్ ప్రకారం చూస్తే , ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్ లో ఒక గొప్ప ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని అంటున్నారు. థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునే రేంజ్ సన్నివేశాలు ఈ చిత్రం లో చాలానే ఉన్నాయట. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం , ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలను ఆడియన్స్ అంత తేలికగా మర్చిపోలేరని అంటున్నారు. విజయ్ దేవరకొండ కూడా చాలా అద్భుతంగా నటించాడట. ఆయన యాసపై సోషల్ మీడియా లో ట్రోల్స్ చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి కానీ , సినిమాలో మాత్రం చాలా నేచురల్ గా ఉన్నింది అట.
ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ తన ప్రతీ సినిమాలోని డైలాగ్ డెలివరీ ని తెలంగాణ యాసతోనే చెప్తుంటాడు , క్యారెక్టర్ కి తగ్గట్టు తనని తానూ మార్చుకోవడం లో విజయ్ విఫలం అవుతున్నాడు అని అనేవారు. కానీ ఈ చిత్రం తో ఆ విమర్శలకు చెక్ పెట్టబోతున్నాడట విజయ్ దేవరకొండ. ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా బాగా వచ్చాయని, ఇలాంటి జానర్స్ ని ఇప్పుడు జనాలు చూడడం లేదు కానీ , ఈ సినిమాతో మళ్లీ ఇలాంటి జానర్స్ కి క్రేజ్ వస్తుందని అంటున్నారు. మరి ఆడియన్స్ నుండి కూడా ఈ రేంజ్ పాజిటివ్ టాక్ వస్తుందో లేదో చూడాలి , ఒకవేళ అలాంటి టాక్ వస్తే మాత్రం విజయ్ దేవరకొండ అభిమానుల ఆకలి తీరినట్టే అనుకోవాలి.