Homeఅంతర్జాతీయంNavi Pillay: చక్కెర తోటలో వలస కూలీ కుటుంబం నుంచి .. నోబెల్ శాంతి బహుమతి...

Navi Pillay: చక్కెర తోటలో వలస కూలీ కుటుంబం నుంచి .. నోబెల్ శాంతి బహుమతి వరకు..

Navi Pillay: ఒకప్పుడు దక్షిణాఫ్రికాలోని చెరుకు తోటలో కూలీలుగా పనిచేసిన కుటుంబం. తరతరాలుగా వివక్షను ఎదుర్కొన్న నేపథ్యం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువుకో ప్రాధాన్యం ఇచ్చిన తల్లిదండ్రులు. చివరికి అంతర్జాతీయ న్యాయ రంగంలో చరిత్ర సృష్టించిన కుమార్తె.. ఇదీ నవీ పిళ్లై జీవిత ప్రస్థానం. భారతీయ, తమిళ మూలాలు ఉన్న దక్షిణాఫ్రికా న్యాయ నిపుణురాలు నవీ పిళ్లైకి 2026 సంవత్సరానికి సంబంధించి నోబెల్ శాంతి బహుమతి లభించడంతో.. ఆమె కుటుంబం గురించి.. నేపథ్యం గురించి నెటిజన్లు తీవ్రంగా శోధిస్తున్నారు. […]

Navi Pillay: ఒకప్పుడు దక్షిణాఫ్రికాలోని చెరుకు తోటలో కూలీలుగా పనిచేసిన కుటుంబం. తరతరాలుగా వివక్షను ఎదుర్కొన్న నేపథ్యం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువుకో ప్రాధాన్యం ఇచ్చిన తల్లిదండ్రులు. చివరికి అంతర్జాతీయ న్యాయ రంగంలో చరిత్ర సృష్టించిన కుమార్తె.. ఇదీ నవీ పిళ్లై జీవిత ప్రస్థానం. భారతీయ, తమిళ మూలాలు ఉన్న దక్షిణాఫ్రికా న్యాయ నిపుణురాలు నవీ పిళ్లైకి 2026 సంవత్సరానికి సంబంధించి నోబెల్ శాంతి బహుమతి లభించడంతో.. ఆమె కుటుంబం గురించి.. నేపథ్యం గురించి నెటిజన్లు తీవ్రంగా శోధిస్తున్నారు.

భారతదేశం నుంచి దక్షిణాఫ్రికాకు

నవీ పిళ్లై ఫ్యామిలీ జర్ని సౌత్ ఆప్రికాలో దాదాపు 130 సంవత్సరాల క్రితం మొదలైంది. 1890లో ఆమె తాత ముత్తాతలు మన దేశం నుంచి దక్షిణాఫ్రికాలో నాటల్ ప్రాంతానికి ఒప్పంద కార్మికులుగా వెళ్లారు . అక్కడ చెరుకు తోటలో కష్టపడి పని చేసేవారు. బ్రిటిష్ పరిపాలన కాలంలో ఒప్పంద కార్మిక వ్యవస్థలో భారతీయులు తీవ్ర శ్రమకు గురయ్యేవారు అలాంటి కష్టాల మధ్య మొదలైన కుటుంబ ప్రయాణం భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో న్యాయం.. మానవ హక్కుల కోసం పోరాడే ఒక మహిళ ఆవిర్భావానికి నేపథ్యంగా మారింది.

బస్సు డ్రైవర్ కుమార్తెగా

నవీ పిళ్లై 1941 సెప్టెంబర్ 23న దక్షిణాఫ్రికాలోని దర్బన్ ప్రాంతంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు నరైన్ స్వామి నాయుడు. ఈయన బస్సు డ్రైవర్ గా పని చేసేవారు. కుటుంబం గడవకపోవడంతో వేర్వేరు పనులు కూడా చేసేవారు. నరైన్ సతీమణి పేరు సంతామ. ఈ దంపతులకు మొత్తం 8 మంది పిల్లలు. ఇందులో నవీ పిళ్లై ఐదవ సంతానం. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ.. కుమార్తెలు చదువుకోవాలని సంతామ దంపతులు . ఆ కాలంలో వివక్ష.. సామాజిక ఆంక్షలు ఎదురైనప్పటికీ అబ్బాయిలతో సమానంగా విద్యను అందించారు. అది కాస్త నవీ పిళ్లై జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది.

దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష పరిపాలన సాగుతున్న సమయంలో నవీ పిళ్లై పెరిగారు. రంగు ఆధారంగా సాగే వివక్షను కళ్లారా చూశారు. ఈ అనుభవాలు ఆమెను న్యాయ రంగంలోకి వెళ్లే విధంగా చేశాయి. నాటల్ విశ్వవిద్యాలయంలో ఆమె 1963 లో బీఏ డిగ్రీ.. 1965లో ఎల్ఎల్ బీ డిగ్రీ పొందారు. 1967లో సొంత న్యాయవాద సంస్థను ఏర్పాటు చేశారు. ఇలా చేసిన తొలి మహిళ గా ఆ ప్రాంతంలో రికార్డు నెలకొల్పారు. నాటల్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న ఆమె వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడేవారు. ఆ పోరాటంలో పాల్గొనే కార్యకర్తలకు న్యాయ సహాయం అందించేవారు. అనంతరం అమెరికాలోని హర్వర్డ్ యూనివర్సిటీ లో హై రేంజ్ లా కోర్సు చదివారు. 1988లో న్యాయ శాస్త్రంలో డాక్టరేట్ సాధించారు.

నవీ పిళ్లై ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. 1995లో దక్షిణాఫ్రికా హైకోర్టు న్యాయమూర్తిగా ఆమె నియమితులయ్యారు. ఆ పదవిని చేపట్టిన బ్లాక్ లేడీ(అప్పట్లో వివక్ష అలా ఉండేది) గా చరిత్రలో నిలిచిపోయారు. ఆ తర్వాత రువాండా అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా.. అధ్యక్షురాలిగా పని చేశారు. యుద్ధ సమయాలలో జరిగిన హింసను అంతర్జాతీయ నేరాలు మరణ హోమం వంటి అంశాలతో ముడిపెట్టి న్యాయాపరంగా గుర్తించడంలో ఆమె కీలకపాత్ర పోషించారు. 2008 నుంచి 2014 వరకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణ, జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం, బాధితులకు న్యాయం అందించడం వంటి అంశాల మీద ఆమె పని చేశారు.

2026 నోబెల్ శాంతి బహుమతికి

నవీ పిళ్లై నోబెల్ శాంతి పీస్ అవార్డు దక్కడం.. ఆమె దశాబ్దాల కృషికి అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది. శాంతిని ప్రోత్సహించడం.. అంతర్జాతీయ చట్టాలను బలపేతం చేయడం.. న్యాయ వ్యవస్థల ద్వారా వివాదాలను పరిష్కరించే మార్గాలకు ఆమె మద్దతు ఇవ్వడం వంటి వాటిని నోబెల్ శాంతి కమిటీ గుర్తించింది. యుద్ధ నేరాలు.. మానవ హక్కుల ఉల్లంఘనలు.. జాతి వివక్ష వంటి అంశాలపై అంతర్జాతీయ న్యాయ సంస్థలు సమర్ధంగా పనిచేయాల్సిన అవసరాన్ని ఆమె తన వృత్తి జీవితం మొత్తం నొక్కి చెప్పారు. చట్టం ముందు అందరూ సమానులనే సూత్రం ప్రపంచ శాంతికి ఎంత అవసరమో ఆమె ప్రస్థానం తెలియజేస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper