Nara Lokesh: AP స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ వ్యూహం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది!.. బయటకు ఆర్భాటం లేకుండానే చినబాబు నారా లోకేష్ తెరవెనుక చక్రం తిప్పారనే చర్చ నడుస్తోంది. ఆయన చేసిన ఎలక్షన్ ఇంజనీరింగ్ , లోతలైన ఎనాలిసిస్ ని చూసి సీనియర్ నాయకులూ సైతం ఆశ్చర్యపోతున్నారు. పార్టీ మీద ఈ స్థాయి పట్టు చూపించడం పై వాళ్ళు మురిసిపోతున్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక విషయం లో నారా లోకేష్ తీసుకున్న ఫార్ములా కారణంగానే ఈరోజు కూటమి కి అద్భుతమైన ఫలితాలు వచ్చాయని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ లో డేటాని సేకరించడం, రెబల్స్ ను బుజ్జగించడం, బూత్ స్థాయి కేడర్‌ను సమన్వయం చేయడంలో లోకేష్ తనదైన ముద్ర వేశారంటున్నారు. చంద్రబాబు అనుభవం, కూటమి బలానికి లోకేష్ అంతర్గత సమన్వయం తోడవడంతో విజయావకాశాలు మెరుగయ్యాయని పార్టీ వర్గాల అంచనా. మరి ఈ ‘సైలెంట్ వ్యూహం’ ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.
2024 ఎన్నికల్లో కూడా కూడా ఇంతే , లోకేష్ తన మార్క్ రాజకీయం చూపించడం వల్లే కూటమి ప్రభంజనం సృష్టించి అధికారం లోకి వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. పైకి చూసేందుకు ఏమి తెలియనట్టు కనిపిస్తాడు కానీ , రాజకీయాల్లో ఎత్తులు , పై ఎత్తులు వేయడం తండ్రికి తగ్గ తనయుడు అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కి కూటమి లో భాగంగా అనంతపురం మేయర్ స్థానాన్ని ఇవ్వడం పై మాత్రం సోషల్ మీడియా లో పార్టీ క్యాడర్ నుండి కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బీజేపీ కి కాకుండా , టీడీపీ, జనసేన పార్టీలు ఆ స్థానం నుండి పోటీ చేసుంటే బంపర్ మెజారిటీ తో గెలిచి ఉండేవని , లోకేష్ అనవసరంగా బీజేపీ కి ఆ స్థానం ఇచ్చాడని అంటున్నారు. కానీ మిత్ర ధర్మాన్ని పాటించడం లో లోకేష్ అసలు వెనకడుగు వెయ్యలేదు అనే చెప్పాలి.
అక్కడ పార్టీ ఓడిపోవడానికి ఎమ్మెల్యే వర్గం రెండుగా చీలిపోవడం వల్లే అని , లేదంటే కచ్చితంగా బీజేపీ ఆ స్థానం లో గెలిచి ఉండేదని అంటున్నారు విశ్లేషకులు. కేంద్రం నుండి కోరినంత నిధులు వస్తున్నాయి, వాళ్ళకోసం ఆ మాత్రం సీట్స్ ని త్యాగం చేయడం లో ఎలాంటి తప్పు లేదని అంటున్నారు నెటిజెన్స్. రాబోయే రోజుల్లో ఇదే స్థానం మరోసారి బీజేపీ కి కేటాయించి సక్సెస్ కొట్టగల కెపాసిటీ లోకేష్ కి ఉందని , ఎప్పుడు గెలవని మంగళగిరి లోనే 90 వేలకు పైగా మెజారిటీ తో గెలిచినా లోకేష్ కి ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్య అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.