Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమెరికా పర్యటనలో ఉన్నారు. క్యాసినోస్, క్లబ్స్ కి ఫేమస్ అయిన లాస్ వేగాస్ లో మకాం వేశాడు. ఈ జల్సా రాయుడు ఇష్టమొచ్చిన క్లబ్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. తన ట్రిప్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఓ క్లబ్ లో న్యూడ్ గర్ల్స్ ఫోటో ఉండగా అక్కడ స్టిల్స్ దిగాడు. అమెరికాలో ఉన్నంత అందంగా జీవితం అందంగా ఎక్కడా ఉండదు అంటూ కామెంట్ చేశాడు. ఈ అమెరికా ట్రిప్ లో వర్మ డల్లాస్, లాస్ వేగాస్ నగరాలను సందర్శించారు. నాటా వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
దర్శకుడు వర్మ అమెరికన్ ట్రిప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎప్పటిలాగే ఫ్యాన్స్, హేటర్స్ తమదైన కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వర్మ వ్యూహం టైటిల్ తో మూవీ చేస్తున్నారు. ఇది ఏపీ సీఎం వై ఎస్ జగన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. వై ఎస్ జగన్ పొలిటికల్ జర్నీ చెప్పే క్రమంలో వర్మ ప్రత్యర్థులను టార్గెట్ చేశాడు. నారా చంద్రబాబు, నాయుడు, పవన్ కళ్యాణ్ ల ఇమేజ్ డ్యామేజ్ చేసే ఆస్కారం కలదు. ఇప్పటికే వదిలిన ప్రోమోలు, పోస్టర్స్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోలిన పాత్రలను చూపించారు.
అనూహ్యంగా ప్రజారాజ్యం ప్రస్తావన కూడా వ్యూహం మూవీలో ఉందనిపిస్తుంది. ఇటీవల వర్మ వ్యూహం మూవీ నుండి వదిలిన స్టిల్స్ లో పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అరవింద్ రెఫెరెన్సులు కనిపించాయి. అల్లు అరవింద్-చిరంజీవి ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉంటుంటే, కొంచెం దూరం నుండి పవన్ కళ్యాణ్ గమనిస్తున్నట్లున్న స్టిల్ వదిలారు. ఈ క్రమంలో వ్యూహం మూవీ ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపడం ఖాయం.
సీఎం జగన్ ని వర్మ రెండు మూడు పర్యాయాలు కలిశారు. ఈ సినిమా విషయమై ఆయన కలిశారని తెలుస్తుంది. ఇక వ్యూహంతో వర్మ ఎంత పెద్ద వివాదం రాజేయనున్నాడో చూడాలి. వర్మ ఇటీవల ఆర్జీవీ డెన్ పేరుతో కొత్త ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఆ ఆఫీస్ సైతం తన టేస్ట్ కి తగ్గట్లు భిన్నంగా రూపొందించారు. తన సినిమా ప్రస్థానానికి సంబంధించిన ఫోటోలతో పాటు అక్కడక్కడా న్యూడ్ ఫొటోలు కూడా జోడించాడు. వర్మ ఆఫీస్ డిజైన్ సైతం వార్తలకు ఎక్కింది.
https://twitter.com/RGVzoomin/status/1677573604098326528