Bro Movie Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ మూవీ ఈ నెల 28 వ తారీజున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రీసెంట్ గానే విడుదల చేసారు. ఈ టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
కానీ నేడు విడుదల చేసిన ‘మై డియర్ మార్కండేయ’ అనే పాటకి మాత్రం ఫ్యాన్స్ నుండి మిశ్రమ స్పందన లభించింది. పవన్ కళ్యాణ్ మరియు థమన్ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు వేరే రేంజ్ లో ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గత రెండు చిత్రాలు భీమ్లా నాయక్ మరియు వకీల్ సాబ్ చిత్రాలకు థమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. ఆయన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి.
మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీ మ్యూజిక్ పై అంచనాలు మామూలు రేంజ్ లో ఉండేవి కాదు. ఆ అంచనాలకు తగ్గట్టు ఈ సాంగ్ దరిదాపుల్లో కూడా లేదు అనే ఫ్యాన్స్ నుండి ఈ రేంజ్ రియాక్షన్ వచ్చింది. అయితే ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ లుక్స్ అదిరిపోయాయి. కానీ ఆయన స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉండడం , సాయి ధరమ్ తేజ్ కి ఎక్కువ ఉండడం అభిమానులకు మరింత నిరాశ కలిగించిన అంశం.
పవన్ కళ్యాణ్ స్క్రీన్ స్పేస్ ని కాసేపు ఉంచి ఉంటే ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చేది కాదు. ఈ సినిమా టీజర్ కి కానీ, మోషన్ పోస్టర్ కి కానీ థమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా మోషన్ పోస్టర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేసింది, సినిమాలో కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలాగే ఉంటుందని ఆశిస్తున్నారు. మరి నెగటివ్ రివ్యూస్ ని దక్కించుకున్న ఈ పాట స్లో పాయిజన్ లాగ అభిమానులకు ఎక్కుతుందో లేదో చూడాలి.