Homeఎంటర్టైన్మెంట్Ram Gopal Varma- Inaya Sultana: ఆయన చెబితే బిగ్‌బాస్‌లోకి పక్కా.. తనకు ఇష్టమైనవారిని పంపుతున్న...

Ram Gopal Varma- Inaya Sultana: ఆయన చెబితే బిగ్‌బాస్‌లోకి పక్కా.. తనకు ఇష్టమైనవారిని పంపుతున్న ఆర్జీవీ

Ram Gopal Varma- Inaya Sultana: కాంట్రవర్సీ దర్శకుడు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా.. అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది రామ్‌గోపాల్‌వర్మ. తెలుగు దర్శకుడైన ఆర్జీవీ తన టాలెంట్‌తో టాలీవుడ్‌లో మంచి సినిమాలు తీశారు. ఆయన టాలెంట్‌తో బాలివుడ్‌ ఆఫర్లు ఆర్జీవీని వెతుక్కుంటూ వచ్చాయి. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సూపర్‌హిట్‌ సినిమాలు తెరకెక్కించారు. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు లె చ్చుకున్నారు. అయితే ఆయన పేరు చాలాకాలం నిలవలేదు. కాదు నిలబెట్టుకోలేదు. సినిమాలు తీయకపోయినా మంచి సినిమాలు తీసినవారికి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంటుంది. కానీ ఆర్జీవీ కాంట్రవర్సీ సినిమాలతో ఇటు అభిమాలనుల్లో అను ఇండస్ట్రీలో చులకనవుతున్నారు. దెయ్య సినిమాలు, బూతు సినిమాలు కూడా తీసేస్థాయికి దిగజారారు. ఇకపోతే రామ్‌గోపాల్‌వర్మ గురించి తాజాగా మరో కాంట్రవర్సీ వైరల్‌ అవుతుంది. అదే బిగ్‌బాస్‌లోకి అనామకుల ఎంట్రీ. ఎలాంటి గుర్తింపు లేనివారు తెలుగు బిగ్‌బాస్‌లోకి వచ్చి గుర్తింపు పొందుతున్నారు. దానికి ఆర్జీవీనే కారణమని ప్రచారం జరుగుతోంది.

Ram Gopal Varma- Inaya Sultana
Ram Gopal Varma- Inaya Sultana

ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు.
రామ్‌గోపాలవర్మ కడుపులో వోడ్కా పడితే తనే చేస్తాడో తనకే తెలియదు. ఏం కూస్తాడో, ట్విట్టర్‌లో ఏం రాస్తాడో, సినిమా ఏం తీస్తాడో అసలే తెలియదు. అంతేనా..? పెగ్గు ఎక్కువైతే ఎంత చిల్లరగా బిహేవ్‌ చేస్తాడో కూడా కొన్ని వీడియోలు చూశాం. తాజాగా ఆర్జీవీ ఓ బిగ్‌బాస్‌ లేడీ కంటెస్టెంట్‌కు వోట్లు వేయాలంటూ ఓ బహిరంగ అప్పీల్‌ చేయడం అందరినీ ఆశ్చర్యపర్చింది. దీని వెనుక కారణం ఏటబ్బా అన్న చర్చ మొదలైంది.

తనకున్న పరిచయంతో..
బిగ్‌బాస్‌ ఇన్నర్‌ సర్కిళ్లు, తెలుగు టీవీ–సినిమా సర్కిళ్లలో చాలామందికి తెలుసు. ముంబైలో ఈ బిగ్‌బాస్‌ ప్లానింగ్‌ చూసుకునే ఓ పెద్దమనిషి వర్మకు బాగా క్లోజ్‌. సో, వర్మ తనకు క్లోజయిన లేడీ కంటెస్టెంట్‌లను అలా హౌస్‌లోకి దించుతున్నాడు. దీంతో వర్మ చల్లని చూపు తమపై పడితే చాలనుకునే లేడీ ఇంటర్వ్యూయర్లు బోలెడు మంది ఎదురు చూస్తున్నారు. అప్పట్లో అరియానా గుర్తుంది కదా.. ఆ బక్క పిల్లను ఒకేఒక ఇంటర్వ్యూలో ఏదో పిచ్చి కామెంట్‌ చేసి, ఆమెను హౌస్‌లోకి పంపించేశాడు వర్మ. బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో ఆమె టాప్‌ 5 కంటెస్టెంట్‌. మధ్యలో ప్రేక్షకులు నెగెటివ్‌ వోట్లు వేసినా సరే, బిగ్‌బాసోడు ఆమెను బయటికి పంపించడానికి వీల్లేదు, అంతేం తరువాత ఆమెను ఓటీటీ బిగ్‌బాస్‌లోకి కూడా ప్రవేశపెట్టాడు. అక్కడా టాప్‌ 5 లో ఉంది ఆమె. ఆషురెడ్డి కూడా ఓ ఇంటర్వ్యూ ద్వారా ఆర్జీవీకి కనెక్టయింది. ఆమెను బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో హౌస్‌లో ప్రవేశపెట్టాడు వర్మ. బిగ్‌బాస్‌ మీద అదీ తన పట్టు.

Ram Gopal Varma- Inaya Sultana
Ram Gopal Varma- Inaya Sultana

తాజాగా ఇనయ..
తాజాగా తన హీరోయిన్‌ ఇనయను బిగ్‌బాస్‌–6లోకి పంపించాడు ఆర్జీవీ. రెండు రోజుల క్రితం హౌస్‌లో ఏదో కెప్టెన్సీ టాస్క్‌ సందర్భంగా శ్రీహాన్‌ ఏదో అన్నాడని ఆమె చాలాసేపు అరుస్తూనే ఉంది. ఏదో పిట్ట అనే పదం వాడాడటం ఒక దశలో చూస్తున్నవాళ్లకే ఇరిటేషన్‌ తెప్పించింది. ఐనా సరే, ఆమెకు వర్మ సపోర్టుగా నిలిచాడు కదా ఏమీ కాదు, తన మనిషి కదా.. తనకు ప్రియమైన హీరోయిన్‌ కదా.. ఆమెకు వోట్లు వేయాలంటూ వర్మ ఏకంగా ట్వీట్‌ పెట్టడంతో గతంలో ఇనయను ఎక్కడెక్కడో పట్టుకుని వర్మ చేసిన డాన్సులు, చివరకు సోయి తప్పి ఆమె కాళ్ల మీద పడిన సీన్లు మళ్లీ వైరల్‌ అవుతున్నయి.

నామినేషన్‌లో ఉందని..
ఇప్పుడు ఇనయ నామినేషన్లలో ఉంది. అయితేనేం, ఏమీ కాదు… మొదటి నుంచీ హౌస్‌లో ఓవరాక్షన్‌ చేస్తోంది. ఎంతసేపూ కెమెరాల అటెన్షన్‌ పొందుతూ, ఎక్కువ స్పేస్‌ దక్కించుకునే ప్రయత్నలో ఉంది. ఇప్పుడ వర్మ ఓట్ల అప్పీల్‌ ట్వీట్‌.. ఇంకేముంది నామినేషన్‌ నుంచి బయటపడుతుంది అని నెటిజన్లు ట్వీట్‌ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె బలమైన బ్యాక్‌ గ్రౌండ్‌ ఉంది మరీ.. అని వెటకారంగా ట్వీటుతున్నారు.

వర్మ అంటే అంతేమరి..
ఇలా ఓ దర్శకుడు బిగ్‌బాస్‌ కంటెస్టెంటుకు ఓట్లు వేయాలంటూ అభ్యర్థించడం ఇదే మొదటిసారి. అఫ్‌కోర్స్, వర్మలోని దర్శకుడు మరణించి ఉండవచ్చుగాక. కానీ ఒకప్పుడు దర్శకుడే కదా. అన్నట్టు ఇనయ తనకు వర్మ ఎంత క్లోజో చెబుతూ ఇన్‌స్టాగ్రాంలో బోలెడు పోస్టులు పెట్టుకుంది. ఆమె ఖాతాలోకి వెళ్తే అవన్నీ దర్శించవచ్చు. ‘ఆర్జీవీగారు.. ఇనయను ప్రేమిస్తే ప్రేమించావు గానీ, బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపించారు. కానీ మరీ ఆమెను ఈసారి విజేతను చేయాలంటూ ఆ బిగ్‌బాసోడికి ఆర్డర్‌ వేయకు ప్లీజ్‌’ అని సూచిస్తున్నారు నెటిజన్స్‌!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular