Ram Gopal Varma- Poonam Kaur
Ram Gopal Varma- Poonam Kaur: హీరోయిన్ పూనమ్ కౌర్ ఇటీవల ఓ సెటైరికల్ ట్వీట్ వేశారు. ఆమె ఏపీ రాజకీయాలపై పరోక్షంగా స్పందించారు. ప్రస్తుతం బ్రో మూవీ విషయంలో జరుగుతున్న రాజకీయ రాద్ధాంతాన్ని ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారన్న వాదన వినిపిస్తోంది. బ్రో మూవీలో శ్యామ్ బాబు అనే పాత్రపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు అభ్యంతరం చెప్పాడు. థర్టీ ఇయర్స్ పృథ్వి చేసిన శ్యామ్ బాబు పాత్ర తనను అవమానించడానికి ప్రత్యేకంగా జొప్పించారని ఆయన ఆరోపణ. బ్రో మూవీ పొలిటికల్ వివాదం రాజేసింది.
బ్రో మూవీ లావాదేవీల మీద ఈడీ సంస్థకు ఫిర్యాదు చేయనున్నట్లు అంబటి రాంబాబు వెల్లడించారు. దీని కోసం ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఈ ఆరోపణలను బ్రో టీమ్ ఖండిస్తోంది. శ్యామ్ బాబు పాత్ర అంబటి రాంబాబుకి రిఫరెన్సు కాదు. సినిమాను సినిమాలా చూడాలి. ఆయన అనవసరంగా ఊహించుకుంటున్నారని అంటున్నారు. ఈ వివాదం నడుస్తుండగా పూనమ్ కౌర్ ట్వీట్ ఆసక్తి రేపింది.
నటి పూనమ్ కౌర్… ”రాజకీయాల్లో వినోదయం సినిమాల్లో సీరియస్నెస్ ఎక్కువైంది” అని ట్వీట్ చేశారు. తన ట్వీట్లో పూనమ్ కౌర్ ఎవరి పేరు మెన్షన్ చేయలేదు. ఎలాంటి ట్యాగ్ జోడించలేదు. అయితే ఆమె బ్రో మూవీ వివాదం గురించే అలా స్పందించారన్న వాదన వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తుంది. పూనమ్ కౌర్ ట్వీట్ కి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించడం విశేషం.
పూనమ్ కౌర్ ట్వీట్ ట్యాగ్ చేస్తూ… సిస్టర్ మీరు రాంగ్, నిజానికి రాజకీయాలు సినిమాగా సినిమాలు రాజకీయాలుగా మారాయి’ అని ట్వీట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వైరల్ అవుతుంది. మొత్తంగా బ్రో మూవీ వివాదంలో పూనమ్ కౌర్, రామ్ గోపాల్ వర్మ తలదూర్చారు. వీరి అభిప్రాయాలపై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీరిని ట్రోల్ చేస్తున్నారు. వర్మ పవన్ కళ్యాణ్ వ్యతిరేకి అన్న విషయం తెలిసిందే. ఈ మాత్రం సందు దొరికినా పవన్ ని కించపరిచేలా మాట్లాడతారు.
NO Sis , I actually think POLITICS has become CINEMA and CINEMA became POLITICAL https://t.co/Uhuj0cBSGD
— Ram Gopal Varma (@RGVzoomin) August 3, 2023