Homeఎంటర్టైన్మెంట్రెండో పెళ్లేంటయ్యా స్వామీ ?: వర్మ

రెండో పెళ్లేంటయ్యా స్వామీ ?: వర్మ

RGV Sumanthవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద కామెంట్స్ ను అలాగే కంటిన్యూ చేస్తూ తాజాగా రెండో పెళ్ళికి రెడీ అయిన హీరో సుమంత్ పై ట్వీట్ వార్ కి దిగాడు. ‘ఒక పెళ్లి నూరేళ్ళ పెంట, అలాంటిది రెండో పెళ్లేంటయ్యా స్వామీ ? నా మాట విని మానెయ్యి. పవిత్రగారు మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. తప్పు మీది, సుమంత్ ది కాదు. తప్పు ఈ దౌర్భాగ్య వ్యవస్థది’ అంటూ వివాదాల వర్మ మరో వివాదానికి తెర తీశాడు.

మొత్తానికి రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ సుమంత్ ని ఎందుకు టార్గెట్ చేసినట్టు ? నిజానికి సుమంత్ ను హీరోగా పరిచయం చేసింది ఆర్జీవీనే. అందుకే కావొచ్చు, సుమంత్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో వార్తలు చూసిన వర్మ తనదైన శైలిలో స్పందించారు.

‘ఒక సారి అయ్యాక కూడా నీకింకా బుద్ది రాకపోవడం ఏమిటి సుమంత్ ? నీ ఖర్మ, ఆ పవిత్ర ఖర్మ. అనుభవించండి,” అంటూ మరో కాంట్రవర్సీ కామెంట్ కూడా చేశాడు. ఏమిటో వర్మ.. వయసు పెరిగేకొద్దీ ఏమి మాట్లాడుతున్నాడో కూడా ఆలోచించడం లేదు అనుకుంటా. ఇక సుమంత్ విషయానికి వస్తే.. హీరోయిన్ కీర్తి రెడ్డితో గతంలో పెళ్లి జరిగింది.

అయితే, ఆమెకు సుమంత్ కి మధ్య వచ్చిన అభిప్రాయబేధాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఇక అప్పటి నుండి దాదాపు 15 ఏళ్ళు ఒంటరిగా ఉన్న సుమంత్ ఇప్పుడు పవిత్ర అనే ఆవిడని పెళ్ళాడబోవడానికి రెడీ అయ్యాడు. వీరి పెళ్లి కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరుగనుందని తెలుస్తోంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

ABN Radhakrishna

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...
Maruti Suzuki Brezza

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...
today horoscope

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...
July 2026 Horoscope

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...
US Iran Conflict

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...
Oktelugu Epaper